డెంజ‌ర్ బెల్స్: డీఎస్పీ కుమారుడికి కరోనా.. పోలీసుల్లో కలవరం

మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ తెలంగాణ‌లోనూ డెంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27కు పెరిగింది. ఆదివారం ఒక్క రోజే 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది....

డెంజ‌ర్ బెల్స్: డీఎస్పీ కుమారుడికి కరోనా.. పోలీసుల్లో కలవరం

Updated on: Mar 23, 2020 | 7:40 AM

మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ తెలంగాణ‌లోనూ డెంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27కు పెరిగింది. ఆదివారం ఒక్క రోజే 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో ఈ విషయం పేర్కొన్నారు. వైరస్ సోకిన వారందరూ హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్, ఛాతీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించారు. కాగా, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా కలకలం రేగుతోంది. డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతడిని హైదరాబాద్‌లోని గాంధీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. డీఎస్పీ కుటుంబసభ్యులందరినీ క్వారంటైన్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొత్తగూడెంకు చెందిన 23 ఏళ్ల యువకుడు లండన్‌లో విద్యాభ్యాసం చేస్తున్నాడు. మార్చి 18న అతడు లండన్ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చాడు. ఇక్కడ నుంచి కారులో కొత్తగూడెం చేరుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

బాధిత యువకుడు మార్చి 18 నుంచి 20 వరకు కొత్తగూడెంలోని తన నివాసంలోనే ఉన్నాడు. కుటుంబసభ్యులతో పాటు కొంత మంది బంధువులు, మిత్రులను కలిసినట్లు తెలుస్తోంది. మార్చి 20న దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించడంతో కరోనాగా అనుమానించి ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు. అతడి నమూనాలను పరీక్షలకు పంపించారు. ఆదివారం (మార్చి 22) అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.