ఆ సుందర నగరాన్ని.. చాలా మిస్ అవుతున్నా…

|

Jul 08, 2020 | 10:28 AM

Dr Andrew Fleming Tweet Missing Vizag COVID-19 : వైజాగ్‌.. లాంటి సుందర ప్రదేశం ఎక్కడా లేదనీ.. విశాఖ నగరంలో ఉన్న రోడ్లు దేశంలో ఎక్కడా కనిపించవని.. గతంలోనూ చాలాసార్లు తెలుగు రాష్ట్రాల యూఎస్‌ డిప్యూటీ హైకమిషనర్‌ అండ్రూ ఫ్లెమింగ్‌ ట్వీట్లు చేశారు.  కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘విశాఖ తీరం చిత్రమిది.. చాలామంది వైజాగ్‌ అని పిలుచుకునే ఈ సిటీ ఆఫ్‌ డెస్టినీ.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరం. అంతేకాదు.. […]

ఆ సుందర నగరాన్ని.. చాలా మిస్ అవుతున్నా...
Follow us on

Dr Andrew Fleming Tweet Missing Vizag COVID-19 : వైజాగ్‌.. లాంటి సుందర ప్రదేశం ఎక్కడా లేదనీ.. విశాఖ నగరంలో ఉన్న రోడ్లు దేశంలో ఎక్కడా కనిపించవని.. గతంలోనూ చాలాసార్లు తెలుగు రాష్ట్రాల యూఎస్‌ డిప్యూటీ హైకమిషనర్‌ అండ్రూ ఫ్లెమింగ్‌ ట్వీట్లు చేశారు.  కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

‘విశాఖ తీరం చిత్రమిది.. చాలామంది వైజాగ్‌ అని పిలుచుకునే ఈ సిటీ ఆఫ్‌ డెస్టినీ.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరం. అంతేకాదు.. చాలామంది అంతర్జాతీయ ఉద్యోగులున్న హెచ్‌ఎస్‌బీసీ (HSBC) విశాఖలో ఉంది. కరోనా కారణంగా మూడు నెలలుగా ఈ సుందరమైన నగరాన్ని చాలా మిస్‌ అవుతున్నాను’ అంటూ తెలుగు రాష్ట్రాల యూఎస్‌ డిప్యూటీ హైకమిషనర్‌ అండ్రూ ఫ్లెమింగ్‌ ట్వీట్‌ చేశారు.

తాజాగా.. విశాఖని మిస్‌ అవుతున్నానంటూ.. ఏరియల్‌వ్యూ ఫొటోతో ఫ్లెమింగ్‌ చేసిన ట్వీట్‌కు నెటిజన్లు లైక్‌లు.. రీట్వీట్లు చేస్తున్నారు.