ఏపీ పోలీసుల పనితీరుపై వర్మ సెటైరికల్ ట్వీట్.. సంపూర్ణేష్ బాబులా..

| Edited By:

Mar 22, 2020 | 1:10 PM

ఏపీలోని విజయనగరం పార్వతీపురం కరోనాపై అవగాహన పెంచుతూ పోలీసులు రాములో.. రాములా పాటకు డాన్స్ చేస్తూ ఉన్న వీడియోను రిలీజ్ చేశారు. ఇది కాస్తా ఆర్జీవీ దృష్టికి చేరడంతో..

ఏపీ పోలీసుల పనితీరుపై వర్మ సెటైరికల్ ట్వీట్.. సంపూర్ణేష్ బాబులా..
Follow us on

రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరే సంచలనం. ఎప్పుడు ఎవరిని ఏ రకంగా గిల్లాలో ఈయనకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. అలాగే ప్రపంచంలో జరిగే ఎలాంటి హాట్ టాపిక్ విషయాలపైనైనా ఆర్జీవీ స్పందించినట్టుగా మరెవరూ.. వెరైటీగా రెస్పాండ్ అవరు. ఇప్పుడు ఇలాంటి వెరైటీ ట్వీట్ చేసే మరోసారి వార్తల్లో నిలిచారు వర్మ.

తాజాగా ఏపీలోని విజయనగరం పార్వతీపురం కరోనాపై అవగాహన పెంచుతూ పోలీసులు రాములో.. రాములా పాటకు డాన్స్ చేస్తూ ఉన్న వీడియోను రిలీజ్ చేశారు. ఇది కాస్తా ఆర్జీవీ దృష్టికి చేరడంతో.. ఒక హైప్ క్రియేట్ అయ్యేలా షాకింగ్ ట్వీట్ చేశారు. ‘సమాజానికి దిశా.. నిర్దేశం చేసే పోలీసులు ఒక పద్దతి ప్రకారం ఉండాలి. సమాజంలో ప్రజలకు ఆదర్శంగా నిలవాలి. కానీ సంపూర్ణేష్ బాబులా కామెడీ చేయకూడదంటూ’ వర్మ.. పోలీసులు డాన్స్ చేసే వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్‌లో ఏపీలోని పార్వతీపురం పోలీసులు.. వాళ్ల ఉన్నతాధికారి వచ్చి షేక్ హ్యాండ్ కోరితే.. వాళ్లు మాత్రం షేక్ హ్యాండ్ బదులు నమస్తే చెప్పాలంటూ.. అక్కడున్న వాళ్లందరూ రాములో రాములా పాటకు డాన్స్ చేస్తూ కరోనాపై స్వీయ నియంత్రణ ఎలా పాటించాలో చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

అలాగే హీరో రజనీకాంత్‌ను ఉద్ధేశించి, కరోనాను ఉద్దేశించి మరో రెండు, మూడు ట్వీట్లు చేశారు ఆర్జీవీ. కరోనాకు పెద్ద చిన్నా అనే తేడా లేదని.. ఈ వైరస్‌కి బయపడి దేవాలయాలు, మసీదులు, చర్చిలు కూడా మూసేశారన్నారు. కరోనాతో మామూలు ప్రజలతో పాటు దేవుళ్లకు కూడా పెద్ద గుణపాఠం నేర్పిందంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.