ఇక నుంచి విమానాల్లోనూ ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ టెస్ట్.!

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజధానిలో వీకెండ్ వస్తే చాలు పోలీసులు తప్పకుండా ఈ టెస్టును నిర్వహిస్తారు. మందుబాబులను గుర్తించేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహిస్తారు. ఇప్పటివరకు వాహనదారులకు మాత్రమే నిర్వహించే ఈ టెస్ట్‌ను ఇకపై విమానాలు నడిపేవారికి కూడా నిర్వహించానున్నారు. కేవలం పైలట్స్‌కు మాత్రమే కాదు.. విమాన సిబ్బందికి, ఎయిర్ […]

  • Ravi Kiran
  • Publish Date - 2:01 pm, Thu, 30 April 20
ఇక నుంచి విమానాల్లోనూ 'డ్రంక్ అండ్ డ్రైవ్' టెస్ట్.!

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజధానిలో వీకెండ్ వస్తే చాలు పోలీసులు తప్పకుండా ఈ టెస్టును నిర్వహిస్తారు. మందుబాబులను గుర్తించేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహిస్తారు. ఇప్పటివరకు వాహనదారులకు మాత్రమే నిర్వహించే ఈ టెస్ట్‌ను ఇకపై విమానాలు నడిపేవారికి కూడా నిర్వహించానున్నారు. కేవలం పైలట్స్‌కు మాత్రమే కాదు.. విమాన సిబ్బందికి, ఎయిర్ కంట్రోల్ స్టాఫ్‌కు కూడా డ్రగ్ సంబంధిత పరీక్షలు నిర్వహించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. ఈ రూల్‌ను దేశంలో ఉన్న మేజర్ ఎయిర్ పోర్టులు అక్టోబర్ 30 నుంచి అమలు చేయనున్నాయి. .

డీజీసీఏ కొత్త రూల్స్ ప్రకారం.. ఒకవేళ ఎవరైనా ఆల్కహాల్ తీసుకున్నట్లు నిర్ధారణ అయినా.. టెస్టులకు వ్యతిరేకించినా.. తప్పించుకోవాలని చూసినా.. అతన్ని ఉద్యోగం నుంచి తప్పించడమే కాకుండా.. లైసెన్స్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేయనున్నారు. రెండోసారి పట్టుబడితే మాత్రం లైసెన్స్‌ను ఏడాది పాటు డీజీసీఏ సస్పెండ్ చేయనుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్, కొచ్చిన్, లక్నో, గౌహతి ఎయిర్‌పోర్టులు ఈ నిబంధనను అక్టోబర్ 30 నుంచి అమలు చేస్తాయని డీజీసీఏ ఆఫీషియల్ ప్రెస్ నోట్‌లో పేర్కొంది. ఇక 33 విమానాశ్రయాలు.. జైపూర్, భువనేశ్వర్, త్రివేండ్రం, ఇండోర్, పాట్నా, అమృతసర్, భోపాల్, సూరత్, నాగ్‌పూర్, కోయంబత్తూరు మొదలగునవి నవంబర్ 30 నుంచి అమలు చేస్తాయని.. చివరిగా మిగిలిన ఎయిర్‌పోర్టులు డిసెంబర్ 31కి అమలు చేస్తాయని వెల్లడించింది. పైలట్లు, ఎయిర్ హోస్టులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్(ఏటీసీ)కు తొలిదశలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. కాగా, ఈ డ్రంక్ ఆండ్ డ్రైవ్ టెస్టులకు పరీక్షలకు సంబంధించి నిబంధనలను త్వరలోనే డీజీసీఏ ఖరారు చేయనుంది.