రాష్ట్రంలో నేటి నుంచి అన్నిఆలయాలు బంద్..!

|

Jun 18, 2020 | 1:52 PM

కేరళలో నేటి నుంచి అన్ని దేవాలయాలు మూత పడనున్నాయి. నేటి నుంచి భక్తులను ఆలయాల్లోకి అనుమతించబోమని కేరళ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. జూన్ 30 వరకు భక్తులకు దేవాలయాల్లోకి అనుమతి ఉండదని తెలిపింది.

రాష్ట్రంలో నేటి నుంచి అన్నిఆలయాలు బంద్..!
Follow us on

కేరళలో నేటి  నుంచి అన్ని దేవాలయాలు మూత పడనున్నాయి. నేటి  నుంచి భక్తులను ఆలయాల్లోకి అనుమతించబోమని కేరళ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. జూన్ 30 వరకు భక్తులకు దేవాలయాల్లోకి అనుమతి ఉండదని తెలిపింది. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయనీ.. కరోనా నివారణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది.

జూన్ నెలాఖరు తర్వాత పరిస్థితులను బట్టి తగు నిర్ణయం తీసుకుంటామని బోర్డు వెల్లడించింది.  దేవాలయాల్లో రోజువారీగా పూజా కార్యక్రమాలు యథావిథిగా జరుగుతాయని వివరించింది. కేర‌ళ‌లో మ‌రోమారు క‌రోనా కోర‌లు చాస్తోంది.  రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. కేరళ ప్రభుత్వం అప్రమత్తమయింది.. తాజాగా లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తర్వాత రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువవుతుండంతో నష్ట నివారణ చర్యలను చేపట్టింది.