Coronavirus: విజృంభిస్తోన్న డెల్టా ప్లస్‌ వేరియంట్‌.. వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ అటాక్..

|

Aug 22, 2021 | 12:24 PM

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా అతలాకుతలమవుతోంది. తాజాగా కొత్త రకం వేరియంట్‌ డెల్టా ప్లస్‌ మరింత విజృంభిస్తోంది. వ్యాక్సిన్‌....

Coronavirus: విజృంభిస్తోన్న డెల్టా ప్లస్‌ వేరియంట్‌.. వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ అటాక్..
Delta Plus Varient
Follow us on

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా అతలాకుతలమవుతోంది. తాజాగా కొత్త రకం వేరియంట్‌ డెల్టా ప్లస్‌ మరింత విజృంభిస్తోంది. వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ డెల్టా కేసులు అధిక మొత్తంలో నమోదుకావడం ఆందోళన కలిగించే విషయం. కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ భారత్‌లో డెల్టా వేరియెంట్‌ కేసులు అధిక మొత్తంలో వెలుగు చూస్తున్నాయని, కరోనా వైరస్‌ జన్యుక్రమాన్ని విశ్లేషించే కన్సోర్టియం ఐఎన్‌ఎస్‌ఏసీఏజీ తెలిపింది. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేయడం లేదని అంచనా వేసింది. అయితే వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో వ్యాధి తీవ్రత అంతగా కనిపించడం లేదని, మరణాలు దాదాపుగా లేవని వెల్లడించింది. దేశంలో మొత్తంగా 30,230 శాంపిల్స్‌ని పరీక్షించి చూస్తే వాటిలో 20.324 డెల్టా కేసులేనని ఐఎన్‌ఎస్‌ఏసీఏజీ తాజా బులెటిన్‌లో తెలిపింది. భారత్‌లో మొదటి సారిగా వెలుగు చూసిన డెల్టా వేరియెంట్‌ బ్రిటన్, అమెరికాలను అతలాకుతలం చేస్తోంది. మన దేశంలోనూ సెకండ్‌ వేవ్‌ ప్రబలంగా ఉండడానికి డెల్టా వేరియెంటే కారణం. దేశంలో ఆర్‌ వాల్యూ 0.89కి తగ్గినప్పటికీ ప్రతీ రోజూ 30 వేలకు పైగా కేసులు నమోదు కావడానికి డెల్టా వేరియెంటే కారణమని ఆ సంస్థ వేస్తున్న అంచనాలు ఆందోళనని పెంచుతున్నాయి.

దీనిపై వైద్యారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకోవాలని, మాస్కులను తప్పనిసరిగా ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్‌ వల్ల వైరస్‌ వ్యాప్తిని కొంత వరకు తగ్గించడంతో పాటు తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ ప్రభావం నుంచి బయటపడవచ్చని అంటున్నారు. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. తొందరగా చర్యలు చేపట్టకపోతే మరోసారి లాక్‌డౌన్‌ విధించాల్సిన పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. చాలా దేశాల్లో కరోనా వైరస్‌ మరోసారి విజృంభణకు ఈ వేరియంట్ దోహదం కానుందని WHO హెచ్చరించింది.

Also Read:Visakapatnam: విశాఖ మన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జ్వరాలు.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనాలు..

: తెలుగు తెర అందాల అత్తకు కోవిడ్ పాజిటివ్.. వ్యాక్సిన్ తీసుకున్నా వదలని మహమ్మారి..