ఢిల్లీలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

| Edited By:

Aug 12, 2020 | 7:28 PM

దేశ రాజధానిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. గడిచిన కొద్ది రోజులుగా నిత్యం వెయ్యికి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన..

ఢిల్లీలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు
Follow us on

దేశ రాజధానిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. గడిచిన కొద్ది రోజులుగా నిత్యం వెయ్యికి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,113 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌
కేసుల సంఖ్య 1,48,504కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1,33,405 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా 10,946 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కాగా, బుధవారం నాడు ఢిల్లీ వ్యాప్తంగా దాదాపు 19 వేల కరోనా టెస్టులు నిర్వహించారు. 6,472 ఆర్టీపీసీఆర్ ద్వారా నిర్వహించగా.. 12,422 రాపిడ్ యాంటిజెన్‌ ద్వారా నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా 12,42,739 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

Read More :

ఆస్పత్రి మెడికల్‌ షాపులో అగ్నిప్రమాదం.. కరోనా రోగుల తరలింపు

శివసేన గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే