తబ్లీఘీ జమాత్‌ చీఫ్‌కు నాలుగోసారి నోటీసులు.. అయినప్పటీకీ..

దేశ వ్యాప్తంగా సంచనలంగా మారిన మర్కజ్ తబ్లీఘీ జమాత్‌ గురించి తెలిసిందే. అయితే ఈ సమావేశాలు ముగిసినప్పటికీ.. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ కరోనా వ్యాప్తికి కారకులుగా మారారన్న ఆరోపణలు తబ్లీఘీ చీఫ్‌పై వచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తబ్లీగ్ జమాత్ చీఫ్ మౌలానా సాద్‌పై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో విచారణకు హాజరుకావాలని పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇవ్వగా.. రాకపోవడంతో.. తాజాగా నాలుగో నోటీసు […]

తబ్లీఘీ జమాత్‌ చీఫ్‌కు నాలుగోసారి నోటీసులు.. అయినప్పటీకీ..

Edited By:

Updated on: Apr 30, 2020 | 3:56 PM

దేశ వ్యాప్తంగా సంచనలంగా మారిన మర్కజ్ తబ్లీఘీ జమాత్‌ గురించి తెలిసిందే. అయితే ఈ సమావేశాలు ముగిసినప్పటికీ.. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ కరోనా వ్యాప్తికి కారకులుగా మారారన్న ఆరోపణలు తబ్లీఘీ చీఫ్‌పై వచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తబ్లీగ్ జమాత్ చీఫ్ మౌలానా సాద్‌పై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో విచారణకు హాజరుకావాలని పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇవ్వగా.. రాకపోవడంతో.. తాజాగా నాలుగో నోటీసు కూడా జారీ చేశారు. మౌలానా సాద్ ప్రభుత్వ లాబోరేటరీకి వచ్చి కరోనా టెస్టులు చేయించుకోవాలని. .అంతేకాదు.. ఆ తర్వాత దర్యాప్తునకు హాజరుకావాలంటూ పోలీసులు మూడు సార్లు నోటీసులు ఇచ్చారు. అయితే మూడు సార్లు నోటీసులు ఇచ్చినప్పటీ.. మౌలానా సాద్ మాత్రం కరోనా టెస్టులకు కానీ.. పోలీసుల దర్యాప్తునకు కానీ హాజరుకాలేదు. దీంతో గురువారం 4వసారి మరో నోటీసు
జారీ చేశారు. ఇప్పటికే సాద్‌పై ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 కింద కేసులు నమోదు చేయడంతో పాటు.. తబ్లీగ్ జమాత్‌కు విదేశాల నుంచి మనీలాండరింగ్ నిబంధనలు ఉల్లంఘించి హవాలా ద్వార విరాళాలు సేకరించారని ఆరోపిస్తూ ఈడీ అధికారులు కూడా కేసులు నమోదు చేశారు.