మెట్రో రైలు ఉద్యోగుల జీత భత్యాల్లో కోత విధిస్తూ ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయం తీసుకుంది. మెట్రో సర్వీసులు నడవని కారణంగా ఉద్యోగుల జీతాల్లో భారీ కోత విధించనున్నారు. ఆగష్టు నెల నుంచి ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సాహకాలు, భత్యాలను 50 శాతం తగ్గించనున్నట్టు మంగళవారం డీఎంఆర్సీ ఒక ఉత్తర్వులో పేర్కొంది. మార్చి 22న దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి మెట్రో సేవలు నిలిచిపోయాయి. అయితే సంస్థ ఉద్యోగులకు చెల్లించే జీతాలు మాత్రం ఇప్పటివరకూ ఆగలేదు. దీంతో దాదాపు 1500 కోట్ల మేర నష్టం వాటిల్లినందున ఉద్యోగుల జీతంలో కో విధిస్తున్నట్టు ప్రకటించింది.
అందులోనూ మెట్రో సేవలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై స్పష్టత లేకపోవడంతో డీఎంఆర్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆగష్టు నెల నుంచే ఈ కోత ప్రారంభం కానుంది. కాగా మరోవైపు ఇంటి నిర్మాణ అడ్వాన్స్, ఇతర అడ్వాన్స్, పండుగల అడ్వాన్స్ వంటి వాటిని తక్షణం అంటే ఇప్పటి నుంచే పెండింగ్‌లో పెట్టాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే ఆమోదం పొందిన అడ్వాన్స్‌లు మాత్రం చెల్లించనున్నారు.
Also Read:
నటి శివ పార్వతికి కరోనా పాజిటివ్.. ఎవరూ పట్టించుకోలేదంటూ ఆవేదన!