ఢిల్లీలో కరోనా విలయం.. కోవిడ్ వార్డుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

| Edited By:

Jun 16, 2020 | 2:15 PM

ఢిల్లీలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తుంది. రోజురోజుకీ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కరోనా రోగులను పశువులకన్నా హీనంగా చూస్తున్నారని..

ఢిల్లీలో కరోనా విలయం.. కోవిడ్ వార్డుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
Follow us on

ఢిల్లీలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తుంది. రోజురోజుకీ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కరోనా రోగులను పశువులకన్నా హీనంగా చూస్తున్నారని మండిపడింది. ఈ క్రమంలో ఢిల్లీలో కోవిడ్ తీవ్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్‌‌ షా స్వయంగా సమీక్షించారు. ఎల్ఎల్‌జేపీ ఆస్పత్రికి వెళ్లి, కరోనా పేషెంట్లకు అందిస్తున్న చికిత్స, వైద్య సదుపాయాలను పరిశీలించారు. అనంతరం కరోనాకు చికిత్స అందిస్తున్న ఢిల్లీలోని అన్ని ఆస్పత్రుల్లోనూ సీసీ కెమెరాలు, క్యాంటిన్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అమిత్‌ షా ఆదేశాలతో కోవిడ్ ఆస్పత్రి వార్డుల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది ఢిల్లీ సర్కార్. రోగులకు అందిస్తున్న చికిత్సను సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యావేక్షించాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది.

ఇక మంగళవారం ఢిల్లీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటలో 1647 కేసులు నమోదవ్వగా.. మొత్తం వీటి సంఖ్య 42,829కి చేరింది. ఇక నిన్న 73 మంది మరణించారు. దీంతో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 1400కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 16,427 మంది కోలుకోగా, ప్రస్తుతం 25,002 మంది చికిత్స పొందుతున్నారు.

Read More: 

ఉద్యోగులకు భారీ ఝలక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..

భగ్గుమంటోన్న పెట్రోల్ ధరలు.. పదో రోజు ఎంత పెరిగిందంటే?