వలస కూలీలపై ఓ రైతన్న పెద్ద మనసు.. ఏకంగా..

కరోనా కట్టడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. స్వగ్రామాలకు కాలిబాటన కొందరు బయల్దేరితే.. మరికొందరు ప్రైవేట్ వాహనాల్లో, మరికొందరు సైకిళ్లపై పయనమవుతున్నారు. అయితే ఇదే క్రమంలో కొందరు యజమానులు.. వలస కార్మికులను నడిరోడ్డపై వదిలేస్తున్నారు. కానీ ఢిల్లీకి చెందిన ఓ రైతు మాత్రం.. వలస కార్మికుల పట్ల తన పెద్ద మనసును చాటుకున్నాడు. బీహార్‌కు చెందిన పదిమంది వలస […]

వలస కూలీలపై ఓ రైతన్న పెద్ద మనసు.. ఏకంగా..

Edited By:

Updated on: May 27, 2020 | 4:50 PM

కరోనా కట్టడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. స్వగ్రామాలకు కాలిబాటన కొందరు బయల్దేరితే.. మరికొందరు ప్రైవేట్ వాహనాల్లో, మరికొందరు సైకిళ్లపై పయనమవుతున్నారు. అయితే ఇదే క్రమంలో కొందరు యజమానులు.. వలస కార్మికులను నడిరోడ్డపై వదిలేస్తున్నారు. కానీ ఢిల్లీకి చెందిన ఓ రైతు మాత్రం.. వలస కార్మికుల పట్ల తన పెద్ద మనసును చాటుకున్నాడు. బీహార్‌కు చెందిన పదిమంది వలస కార్మికులను వారి స్వగ్రామం చేర్చేందుకు.. విమాన టికెట్లు బుక్‌ చేశాడు.

గురువారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుంచి పాట్నాకు విమానం బయల్దేరనుంది. దీనిలోనే ఈ 10 మంది వలస కార్మికులు వెళ్లనున్నారు. వీరంతా ఏప్రిల్ నెలలోనే ఇళ్లకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. కానీ.. కరోనా తీవ్రత వేగంగా ఉండటంతో పాటు.. పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. అలానే ఉండిపోయారు. ఏదో ట్రైన్‌లోనో.. బస్సులోనే స్వగ్రామాలకు వెళ్తామనుకున్నాం కానీ..విమానంలో వెళ్తామని కలలో కూడా ఊహించలేదని కూలీలు చెబుతున్నారు. తమ యజమానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమంటూ ఆ వలస కార్మికులు ఆనంద బాష్పాలు రాల్చారు. పప్పన్‌ సింగ్‌ అనే పుట్టగొడుగులు పండించే ఓ రైతు దగ్గర వీరంతా పనిచేస్తుంటారు.