Delhi COVID-19 news: ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ.. మాల్స్​, జిమ్​లు క్లోజ్.. మరిన్ని ఆంక్షలు

|

Apr 15, 2021 | 2:26 PM

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకంగా మారింది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. దేశ రాజధాని ఢిల్లీలో..

Delhi COVID-19 news: ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ.. మాల్స్​, జిమ్​లు క్లోజ్.. మరిన్ని ఆంక్షలు
Delhi Corona Updates
Follow us on

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకంగా మారింది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కరాళ నృత్యం చేస్తుంది. ఈ క్రమంలో ఢిల్లీలో కరోనా వ్యాప్తి కట్టడి కోసం.. వారాంతపు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు సీఎం  కేజ్రివాల్ ప్రకటించారు. ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఢిల్లీలో ప్రమాదకర రీతిలో బుధవారం 17,282 కేసులు నమోదయ్యాయి. 104 మంది వైరస్ కారణంగా మరణించారు.

ఈ క్రమంలో ఢిల్లీ ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్‌తో.. కేజ్రివాల్ సమవేశమయ్యారు. కరోనా కట్టడి కోసం ఆంక్షలను అమలు చేయనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్‌కు తెలిపారు. అనంతరం.. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ వారాంతపు లాక్‌డౌన్ అనౌన్స్ చేశారు.

లాక్‌డౌన్ సమయంలో మాల్స్‌, ఆడిటోరియంలను.. మూసివేయనున్నట్లు ప్రకటించారు కేజ్రీవాల్​. పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు చేసుకునేవారికి.. పాస్‌లు ఇస్తామని వివరించారు. రెస్టారెంట్లలో తినడానికి వీల్లేదన్న ఢిల్లీ సీఎం.. పార్శిల్ తీసుకెళ్లేందుకే పర్మిషన్ ఇస్తామని తెలిపారు. సినిమా థియేటర్లు 30శాతం సామర్థ్యంతోనే.. నడపాలని ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలోని ఆసుపత్రుల్లో పడకల కొరతలేదని.. కేజ్రివాల్‌ వెల్లడించారు. ప్రస్తుత డేటా ప్రకారం 5 వేల పడకలు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు.

Also Read: అనుమానాస్పదంగా రోడ్డు పక్కన లగేజీ బ్యాగ్.. ఏంటా అని తెరిచి చూడగా షాకింగ్

హోంగార్డులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ హైకోర్టు.. వారివి సివిల్‌ పోస్టులే అని స్పష్టం