వ్యాక్సిన్ రవాణాకు సిద్ధమంటున్న విమానయాన సరుకు రవాణా సంస్థలు…. వీడియోను విడుదల చేసిన జీఎమ్మార్ హైదరాబాద్….

| Edited By:

Dec 05, 2020 | 11:42 AM

దేశీయ విమానయాన సరుకు రవాణా సంస్థలైన జీఎమ్మార్, ఢిల్లీ ఎయిర్ పోర్టు కార్గో సంస్థలు వ్యాక్సిన్ రవాణాకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ... నిమిషం కలిగిన వీడియోను రూపొందించాయి.

వ్యాక్సిన్ రవాణాకు సిద్ధమంటున్న విమానయాన సరుకు రవాణా సంస్థలు.... వీడియోను విడుదల చేసిన జీఎమ్మార్ హైదరాబాద్....
Follow us on

GMR Hyderabad air cargo and Delhi Airport’s air cargo are set to play a pivotal role in the distribution of vaccines

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోంది. అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకునే అమెరికా కరోనా కేసుల జాబితాలో ప్రథమ స్థానంలో ఉంది. అక్కడ కరోనా కేసులు 1,43,53,740 నమోదు అయ్యాయి. మరణాలు 2,79,726 సంఖ్యకు చేరాయి. తర్వాత బాధిత దేశాల జాబితాలో భారత్, బ్రెజిల్ ఉన్నాయి. అయితే అమెరికా, భారత్, రష్యా సహా పలు దేశాల్లోని ఔషధ కంపెనీలు కరోనాకు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.

రవాణాకు మేము సిద్ధం…

కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ తయారీ ఒకవైపు జరుగుతుండగా.. పలు సంస్థలు పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ రవాణా చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ విమానయాన సరుకు రవాణా సంస్థలైన జీఎమ్మార్, ఢిల్లీ ఎయిర్ పోర్టు కార్గో సంస్థలు వ్యాక్సిన్ రవాణాకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ… నిమిషం కలిగిన వీడియోను రూపొందించాయి. ఈ వీడియోలో వ్యాక్సిన్ ను భద్రపరిచే విధానం, రవాణాకు సిద్ధం చేసే ప్రక్రియ, నిల్వ ఉంచే విధానం, తరలించే, అందించే విధానాన్ని స్పష్టంగా వీడియోలో తెలిపారు. దీంతో దేశీయ సంస్థలు అంతర్జాతీయంగా లభించే టీకాను భారత్ కు తీసుకొచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపాయి.