కొవిషీల్డ్‌పై ఆరోణలు.. ఆ వలంటీర్ ఫిర్యాదులో వాస్తవం లేదంటూ తేల్చి చెప్పిన డీసీజీఐ…

‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ వేసుకున్న తరువాత తన శరీరంలో నాడీ సంబంధిత సమస్యలు తలెత్తాయంటూ ఫిర్యాదు చేసిన చెన్నైకి చెందిన..

కొవిషీల్డ్‌పై ఆరోణలు.. ఆ వలంటీర్ ఫిర్యాదులో వాస్తవం లేదంటూ తేల్చి చెప్పిన డీసీజీఐ...
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 03, 2020 | 8:25 AM

‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ వేసుకున్న తరువాత తన శరీరంలో నాడీ సంబంధిత సమస్యలు తలెత్తాయంటూ ఫిర్యాదు చేసిన చెన్నైకి చెందిన వలంటీర్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) రివర్స్ షాక్ ఇచ్చింది. అతడు చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. తమకు అందిన ఫిర్యాదులో వాస్తవం లేదని, అతనిలో తలెత్తిన నాడీ సమస్యలకు, ‘కొవిషీల్డ్’ వాక్సిన్‌కు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది.

సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ ట్రయల్స్‌లో చెన్నైకి చెందిన 40 ఏళ్ల వ్యక్తి పాల్గొన్నాడు. అయితే ట్రయల్స్‌లో పాల్గొన్న తరువాత తన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని, అనేక రుగ్మతల బారిన పడ్డానని, ట్రయల్స్‌ పేరుతో తనను అనారోగ్యానికి గురి చేసినందుకు గానూ రూ.5 కోట్ల రూపాయలు చెల్లించాలని అతను డిమాండ్ చేశాడు. ఈ మేరకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీకి కూడా లీగల్ నోటీసులు పంపించాడు. ఒకవేళ తనకు పరిహారం చెల్లించకపోతే వ్యాక్సిన్ బయటకు రాకుండా అడ్డుకుంటానని హెచ్చరించాడు.

ఈ నేపథ్యంలో స్పందించిన డీసీజీఐ.. వైద్య నిపుణుల బృందంతో కూడిన స్వతంత్ర దర్యాప్తు కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా డీసీజీఐ అతని ఫిర్యాదును తిరస్కరించింది. అతడిలో తలెత్తిన నాడీ సమస్యలకు, వ్యాక్సిన్‌ డోసుకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు, సదరు వలంటీర్ డిమాండ్ చేసినట్లు అతనికి పరిహారం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది.