సోనూసూద్ ఆపన్న హస్తం.. నేటి నుంచి చిన్నారికి చికిత్స, ధన్యవాదాలు తెలిపిన బాలుడి తల్లిదండ్రులు

నటుడు సోనూసూద్ ఆపన్న హస్తం అందించి నేనున్నానంటూ నిలిచిన.. చిన్నారికి నేటి నుంచి చికిత్స అందబోతోంది. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం..

సోనూసూద్ ఆపన్న హస్తం..  నేటి నుంచి చిన్నారికి చికిత్స, ధన్యవాదాలు తెలిపిన బాలుడి తల్లిదండ్రులు
Follow us
Venkata Narayana

|

Updated on: Dec 03, 2020 | 5:01 AM

నటుడు సోనూసూద్ ఆపన్న హస్తం అందించి నేనున్నానంటూ నిలిచిన.. చిన్నారికి నేటి నుంచి చికిత్స అందబోతోంది. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం వీరన్నపేటకు చెందిన రాములు, కవితల దంపతులకు ఈ సంవత్సరం జనవరిలో బాబు జన్మించాడు. బాబు అనారోగ్యానికి గురికావడంతో చిన్నారి తల్లిదండ్రులు ఇప్పటికే 2 లక్షల దాకా చికిత్స కోసం ఖర్చు చేశారు. బాబు ఆరోగ్యం మెరుగుపడాలంటే మరో రెండు, మూడు లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో ఆందోళన చెందారు. బాబు విషయం తెలుసుకున్న సోనూసూద్‌ అపోలో ఆస్పత్రి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి మొత్తం ఖర్చు తానే భరిస్తానని బాబుకు వైద్యం చేయాలని సూచించారు. కాగా, చిన్నారి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో సోనూ సూద్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.