Crematorium Workers: కాటికాపరులంతా కరోనా యోధులే.. గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..

|

May 13, 2021 | 7:59 AM

Frontline Warriors: దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ తరుణంలో చాలాచోట్ల విపత్కర పరిస్థితులు

Crematorium Workers: కాటికాపరులంతా కరోనా యోధులే.. గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
Crematorium Workers
Follow us on

Frontline Warriors: దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ తరుణంలో చాలాచోట్ల విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా మృతదేహాలతో శ్మశానవాటికలన్నీ నిండిపోతున్నాయి. నిరంతరం 24 గంటలపాటు కాటికాపరులు మృతదేహాలకు దహనసంస్కారాలు నిర్వహిస్తూనే ఉంటున్నారు. ఈ క్రమంలో శ్మశానవాటికల్లో పనిచేస్తున్న కాటికాపరులందరినీ కరోనా యోధులుగా గుర్తిస్తూ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్న కాటికాపరులను ఏప్రిల్ 1వ తేదీ నుంచి కరోనా వారియర్స్ గా గుర్తించామని సీఎం విజయ్ రూపానీ బుధవారం ప్రకటించారు. కాటికాపరులు శ్మశానవాటికలో విధి నిర్వహణలో మరణిస్తే వారి కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం అందజేస్తామని సీఎం వెల్లడించారు. దీంతో పాటు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కరోనా బారిన పడితే వారి చికిత్సకు ‘మా కార్డు’, ‘వాత్స్యల్య కార్డు’ల కింద ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని రూపానీ పేర్కొన్నారు.

కాగా.. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో కూడా నిత్యం 10వేలకుపైగా కరోనా కేసులు నమోదువుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో నిన్న 11,017 కరోనా కేసులు నమోదు కాగా.. 102 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7 లక్షలు దాటగా.. ఇప్పటివరకూ 8,731 మంది మరణించారు.

Also Read:

Gang Rape: బీచ్‌లో సరదాగా గడిపేందుకు వచ్చిన జంట.. స్నేహితుడిని బంధించి యువతిపై సామూహిక అఘాయిత్యం..!

క్రెడిట్ కార్డుతో ఇబ్బందులు పడుతున్నారా ? మీ కార్డ్ క్లోజ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..