ఏపీని వెంటాడుతున్న క‌రోనా.. కొత్తగా 71 కేసులు

|

Apr 30, 2020 | 12:08 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో గత 24 గంటల్లో కొత్తగా 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇంత వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య

ఏపీని వెంటాడుతున్న క‌రోనా.. కొత్తగా 71 కేసులు
Follow us on
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల్ని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇంత వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 1403కు చేరింది. కరోనా కారణంగా ఇంత వరకూ 31 మంది మరణించారు. గత 24 గంటలలో అత్యధికంగా కర్నూలు  జిల్లాలో 43  కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలు  జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 386కుపెరిగింది.
గురువారం వైద్యాధికారులు విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ మేర‌కు కర్నూలు జిల్లాలో 43, కృష్ణా జిల్లాలో 10.. గుంటూరు, కడప జిల్లాల్లో 4 చొప్పున.. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 3 చొప్పున.. తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో రెండు కేసుల‌ చొప్పున నమోదయ్యాయి. తాజా కేసులు కలిపితే మొత్తం కేసుల సంఖ్య 1403 కాగా.. డిశ్చార్జ్ అయిన వారు కాకుండా యాక్టివ్ కేసులు 1051గా ఉన్నాయి. రాష్ట్రంలో అత్య‌ధికంగా క‌ర్నూలు జిల్లాలో 386 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. త‌ర్వాత గుంటూరు జిల్లాలో 287 కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. కృష్ణా జిల్లాలో కూడా 246 కేసులు న‌మోద‌య్యాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కేసు కూడా లేక‌పోవ‌డంతో  విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌రోనా వైర‌స్ బారినుంచి త‌ప్పించుకుంద‌నే చెప్పాలి.