Covid Guidelines: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు జారీ

|

Jan 05, 2022 | 4:25 PM

Home Isolation New Guidelines : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభణ కొనసాగుతోంది. కరోనాకు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తోడవడంతో కేసుల సంఖ్య క్రమంగా పెరగుతోంది.

Covid Guidelines: దేశవ్యాప్తంగా  కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు జారీ
Corona Virus India
Follow us on

Covid-19 Update Home Isolation New Guidelines: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభణ కొనసాగుతోంది. కరోనాకు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తోడవడంతో కేసుల సంఖ్య క్రమంగా పెరగుతోంది. గత కొన్ని రోజుల దాకా రోజూవారీ కేసులు 10 వేల లోపే ఉంటే ప్రస్తుతం 30 వేలు, 50 వేల కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం అయా రాష్ట్రాలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్ నియంత్రణలో భాగంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఈ క్రమంలోనే హోం ఐసోలేషన్ లో ఉంటున్న పేషెంట్లకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. సింప్టమ్స్ తక్కువగా ఉండనివారికి, అసలే లేని వారికి ఈ మార్గదర్శకాలు వర్తించనున్నాయి. వరసగా మూడు రోజులు జ్వరం రాకపోతే కేవలం 7 రోజుల ఐసోలేషన్ ఉంటే సరిపోతుందని కేంద్రం తెలిపింది. కోవిడ్ వచ్చిన వారు ట్రిపుల్ లేయర్ మాస్క్ లను ధరించాలని, వెంటిలేషన్ బాగా ఉండే రూంలో ఐసోలేట్ అవ్వాలని సూచించింది. ఇతరులతో ఎటువంటి కాంటాక్ట్ లేకుండా చూసుకోవాలని కేంద్రం కోరింది. హోం ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

హెచ్ఐవీ, అవయవాలు ట్రాన్స్‌ప్లాంట్ , క్యాన్సర్ థెరపీ లేని వారు మాత్రమే హోం ఐసోలేషన్ కు అనుమతించడం జరుగుతుందని మార్గదర్శకాలు జారీ చేసింది. హైగ్రేడ్ ఫివర్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆక్సిజన్ శాతం 93 కన్నా తక్కువగా ఉండేవారికి ఖచ్చితంగా మెడికల్ సపోర్ట్ అవసరమని కేంద్రం తెలిపింది.

ఎప్పటికప్పుడు పల్స్ రేట్ చెక్ చేసుకోవాలంటూ సూచించింది. కనీసం 72 గంటల తర్వాత ఉపయోగించిన మాస్క్‌లను ముక్కలుగా కత్తిరించి పడేయాలని తెలిపింది. కుటుంబసభ్యులు ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తి దగ్గరకు రావాల్సి వస్తే.. ఇద్దరూ ఎన్‌ 95 మాస్క్‌ను ఉపయోగించాలి. బాధితులు వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలని కేంద్ర తెలిపింది. రోజుకు మూడు సార్లు వేడి నీటితో గార్గిల్‌ చేసుకోవడం, ఆవిరి పట్టడం వంటివి చేయాలి. జ్వరం తగ్గకపోతే వైద్యులను సంప్రదించి పారాసిటమాల్‌ ట్యాబ్లెట్లు వేసుకోవాలి. తరచుగా జ్వరం, ఆక్సిజన్‌ లెవల్స్‌ను చెక్‌ చేసుకోవాలి. చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. తరచూ ముక్కు, నోటిని తాకడం వంటివి చేయకూడదని పేర్కొన్న కేంద్ర ఆరోగ్య శాఖ.. బాధితులు ఉంటున్న గదిని శుభ్రంగా ఉంచాలని సూచించింది. ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో కరోనా బాధితులు ఉపయోగించే వస్తువులను ఇతరులతో పంచుకోకూడదని ఆరోగ్య శాఖ తెలిపింది.

Read Also…  Third Wave Hit Delhi: థర్డ్ వేవ్ మొదలైంది.. ఏ క్షణమైనా లాక్ డౌన్ …!(వీడియో)