TS Corona Cases: తెలంగాణలో కొత్తగా కలవరం.. ఇవాళ కాస్త పెరిగిన కరోనా వైరస్.. కొత్త పాజిటివ్ కేసులు ఎన్నంటే..?

Telangana Corona: తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసుల్లో హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ఒక రోజు తక్కువ మరో రోజు ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

TS Corona Cases: తెలంగాణలో కొత్తగా కలవరం.. ఇవాళ కాస్త పెరిగిన కరోనా వైరస్.. కొత్త పాజిటివ్ కేసులు ఎన్నంటే..?
Corona

Updated on: Sep 29, 2021 | 9:25 PM

Telangana Covid 19 Cases: తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసుల్లో హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ఒక రోజు తక్కువ మరో రోజు ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 245 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,65,749కు పెరిగింది. ఇక, ఒక్కరోజు వ్యవధిలో మరో 173 మంది బాధితులు కరోనా వైరస్‌ బారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 6,57,213 మంది బాధితులు కోలుకున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ఇదిలావుంటే, 24 గంటల్లో కరోనా మహమ్మారి ధాటికి ఒకరు ప్రాణాలను కోల్పోయారు.. దీంతో తెలంగాణలో మొత్తం మృతుల సంఖ్య 3,916కు చేరింది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 4,620 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇవాళ రాష్ట్రంలో 52,683 మందికి కొవిడ్‌ నిర్ణారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు 2,63,33,345 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

జిల్లాల వారీగా ఇవాళ నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి..

Telangana Covid19

Read Also…  SBI We Care: ఎస్బీఐ వుయ్ కేర్ పథకం చివరి తేదీ పొడిగించారు.. ఈ పథకం వివరాలు.. ఇప్పటివరకూ పొడిగించారో తెలుసుకోండి!