పాక్‌ను కలవరపెడుతోన్న కరోనా.. లాక్‌డౌన్‌పై ఏం నిర్ణయం తీసుకుందంటే..?

| Edited By:

Apr 15, 2020 | 7:45 PM

ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి.. పాకిస్థాన్‌లో కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో.. పాక్ ప్రభుత్వం కలవరపడుతోంది. ఇప్పటికి ఇంకా అనేకమంది కరోనా అనుమానితులకు టెస్టులు చేయాల్సి ఉంది. దీంతో పాక్‌ ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి.. కరోనా పరీక్షలు చేస్తోంది. ఇప్పటికే దేశంలో 6 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదవ్వగా..వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే లాక్‌డౌన్‌ విధించినప్పటికీ కరోనా కేసులు […]

పాక్‌ను కలవరపెడుతోన్న కరోనా.. లాక్‌డౌన్‌పై ఏం నిర్ణయం తీసుకుందంటే..?
Follow us on

ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి.. పాకిస్థాన్‌లో కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో.. పాక్ ప్రభుత్వం కలవరపడుతోంది. ఇప్పటికి ఇంకా అనేకమంది కరోనా అనుమానితులకు టెస్టులు చేయాల్సి ఉంది. దీంతో పాక్‌ ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి.. కరోనా పరీక్షలు చేస్తోంది. ఇప్పటికే దేశంలో 6 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదవ్వగా..వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే లాక్‌డౌన్‌ విధించినప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండటంతో.. ఇమ్రాన్‌ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడగించారు. దీంతో పాకిస్థాన్‌లో కూడా ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది.

ఇక పాకిస్థాన్‌లో 20 కోట్ల మందికి పైగా జనాభా ఉండగా.. ఇప్పటి వరకు డెబ్బైవేలకు పైగా కరోనా పరీక్షలు జరిపినట్లు పాకిస్థాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో దాదపు ఆరువేల పాజిటివ్ కేసులు తేలగా.. మిగతావన్నీ నెగిటివ్‌గా తేలినట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,280 మందికి కరోనా టెస్టులు జరిపినట్లు ప్రకటించింది. అయితే దేశంలో నమోదైన కేసులన్నీ.. పంజాబ్ ప్రావిన్స్‌, సింధ్ ప్రావిన్స్‌లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే దేశ జనాభాలో ఎక్కువగా పంజాబ్‌ ప్రావిన్స్‌లోనే ఉండటం.. ఇక్కడే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవ్వడంతో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.