కరోనా షాకింగ్: లక్షణాలు లేకపోయినా..యువతలో వైరస్ స్ట్రోక్

కరోనా వైరస్ ఎలా ఎటాక్ చేస్తుందో..? ఎక్కడ నుంచి వచ్చి ఎలా అంటుకుంటుందో.. తెలియని పరిస్థితి.. ఇక, వైరస్ బారినపడినా కొందరిలో లక్షణాలు కనిపించడంలేదు. కానీ, టెస్ట్ చేస్తే పాజిటివ్ అని తేలుతోంది. అయితే, దీనిపై వార్నింగ్ ఇస్తున్నారు శాస్త్రవేత్తలు...

కరోనా షాకింగ్: లక్షణాలు లేకపోయినా..యువతలో వైరస్ స్ట్రోక్
Follow us

|

Updated on: Jun 06, 2020 | 6:53 PM

కరోనా వైరస్ ఎలా ఎటాక్ చేస్తుందో..? ఎక్కడ నుంచి వచ్చి ఎలా అంటుకుంటుందో.. తెలియని పరిస్థితి.. ఇక, వైరస్ బారినపడినా కొందరిలో లక్షణాలు కనిపించడంలేదు. కానీ, టెస్ట్ చేస్తే పాజిటివ్ అని తేలుతోంది. అయితే, దీనిపై వార్నింగ్ ఇస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆరోగ్యంగా ఉన్న యువతకు కోవిడ్ లక్షణాలు కనిపించకపోయినా..బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ముప్పు అధికంగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

మార్చి 20 నుంచి ఏప్రిల్ 10 మధ్య తాము చేసిన పరిశోధనతో ఈ విషయం గమనించామని థామస్ జెఫర్సన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. తాము చూసిన స్ట్రోక్స్ ఎప్పటిలా సాధారణంగా లేవని న్యూరో సర్జరీ జర్నల్‌లో ప్రచురించారు. 30,40,50 ఏళ్ల వయసు కరోనా బాధితుల్లో భారీ స్ట్రోక్స్ గమనించామంటున్నారు. సైంటిస్టులు. సాధారణంగా ఇలాంటి స్ట్రోక్స్ 70,80 ఏళ్ల వయసు వారిలో వస్తుంటాయని అంటున్నారు. కరోనా సోకిన 14 మందిలో స్ట్రోక్స్ లక్షణాలను పరిశీలిస్తే.. ఫలితాలు ఆందోళనకరంగా ఉన్నాయని, శాంపిల్స్ సైజ్ చిన్నదే అయినా..రిజల్ట్స్ దారుణంగా ఉన్నాయని చెప్పారు.