క్వారంటైన్‌ పూర్తి చేస్తే రూ.2వేల ప్రోత్సాహకం..స్థానికులకు ఉపాధి

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. పట్టణాలు, పలెల్లు అనే తేడా లేకుండా మహమ్మారి జడలు విప్పుకుంటోంది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు అమలు చేస్తున్నప్పటికీ వైరస్ వ్యాప్తి అడ్డు అదుపు లేకుండా విజృంభిస్తోంది. ఇటువంటి తరుణంలో..

క్వారంటైన్‌ పూర్తి చేస్తే రూ.2వేల ప్రోత్సాహకం..స్థానికులకు ఉపాధి

Updated on: Jun 29, 2020 | 7:27 PM

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. పట్టణాలు, పలెల్లు అనే తేడా లేకుండా మహమ్మారి జడలు విప్పుకుంటోంది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు అమలు చేస్తున్నప్పటికీ వైరస్ వ్యాప్తి అడ్డు అదుపు లేకుండా విజృంభిస్తోంది. ఇటువంటి తరుణంలో కరోనా నియంత్రణకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా నియంత్రణకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాలుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఇతర ప్రాంతాల నుంచే వారి పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ…వైరస్‌ విస్తరించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇతర రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రానికి వచ్చిన వారు క్వారంటైన్‌ పూర్తి చేస్తే రూ.2వేల ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నారు. ఇందుకు కోసం ఆయా జిల్లా కేంద్రాల్లో తాత్కాలిక క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జాజ్‌పూర్‌ జిల్లాలో 1300పైగా తాత్కాలిక క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆ జిల్లా మెజిస్ట్రేట్‌ రంజన్‌కుమార్‌ దాస్‌ తెలిపారు. క్వారంటైన్‌లో ఉన్న పెద్దలకు రోజుకు రూ.120, చిన్నారులకు రూ.100 విలువైన భోజనాన్ని అందిస్తున్నారు.

అంతేకాదు, క్వారంటైన్‌ కేంద్రాల్లో పని చేయాలనుకునే వారికి గార్డెనింగ్‌, పేయింటింగ్‌ తదితర పనులు అప్పగిస్తున్నారు. ఇలా గరిష్ఠంగా 10రోజులు పని కల్పించి రోజుకు రూ150 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ తాత్కాలిక క్వారంటైన్‌ కేంద్రాల్లో సౌకర్యాలను జిల్లా మెజిస్ట్రేట్‌ పర్యవేక్షిస్తారు. క్వారంటైన్‌లో ఉన్న వారికి టూత్‌బ్రష్‌, పేస్టు. బకెట్‌, సాన్నపు సబ్బు, దుస్తుల సబ్బు, మంచం, బెడ్‌షీట్లు తదితర వస్తువులు అందజేస్తున్నారు. ఉదయం అల్పాహారం, టీతోపాటు మధ్యాహ్నం భోజనం, సాయంత్రం బిస్కెట్లు, స్నాక్స్‌తోపాటు రాత్రి భోజనం పెడుతున్నారు. క్వారంటైన్‌లో ఉంటున్న వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా ఒడిశా నిలిచింది.