International Covid Update: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనావైరస్ కొరలు చాస్తోంది. నిత్యం పెరుగుతున్న కరోనా కేసులతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఏడాది గడిచినా.. కూడా ప్రతీ రోజూ నమోదయ్యే పాజిటివ్ కేసులు, మరణాలకు మాత్రం బ్రేక్ పడట్లేదు. గత 24గంటల్లో 2,86,116 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు 112,263,022 దాటాయి. గడచిన 24గంటల్లో ఈ మహమ్మారి కారణంగటా 6,522 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 23,20,576 కు దాటింది. ఇప్పటివరకు కరోనా నుంచి 87,788,837 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2.19 కోట్లకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల్లో అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇండియా , బ్రెజిల్, రష్యా, బ్రిటన్ ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. మొత్తం మరణాల్లో కూడా అమెరికానే అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ కొనసాగుతున్నాయి.
Also Read: