నిబంధ‌న‌ల ఉల్లంఘ‌నః 348 న‌ర్సింగ్ హోంలు మూసివేత !

నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డి అధికారుల ఆదేశాలు బేఖాత‌రు చేసిన ఆస్ప‌త్రుల‌పై మున్సిప‌ల్ అధికారులు వేటు వేశారు. 348 న‌ర్సింగ్ హోంల‌ను మూసివేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

నిబంధ‌న‌ల ఉల్లంఘ‌నః 348 న‌ర్సింగ్ హోంలు మూసివేత !

Updated on: Apr 28, 2020 | 11:21 AM

క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న త‌రుణంలో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని కేంద్రం గ‌ట్టి హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు కూడా క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు క‌ట్ట‌దిట్ట‌మైన కార్యాచ‌ర‌ణ అమ‌లు చేస్తున్నారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డి అధికారుల ఆదేశాలు బేఖాత‌రు చేసిన ఆస్ప‌త్రుల‌పై మున్సిప‌ల్ అధికారులు వేటు వేశారు. 348 న‌ర్సింగ్ హోంల‌ను మూసివేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు.
లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు ప‌ట్టించుకోని 348 న‌ర్సింగ్ హోంల‌ను మూసివేయాల‌ని బృహాన్ ముంబ‌య్ కార్పొరేష‌న్ బీఎంసీ సోమ‌వారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మ‌హారాష్ట్ర‌లోని ముంబ‌యి న‌గ‌రంలో ఉన్న‌1068 న‌ర్సింగ్ హోమ్స్‌లో 25 శాతం మూత‌ప‌డ్డాయి. ప‌లుమార్లు హెచ్చ‌రించిన‌ప్ప‌టికీ నిబంధ‌న‌ల‌ను ఖాత‌రు చేయ‌నందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా బీఎంసీ పేర్కొంది. ఆయా క్లీనిక‌ల్ రిజిస్ట్రేష‌న్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఈ సంద‌ర్భంగా గ్రేట‌ర్ ముంబ‌యి మున్సిప‌ల్‌కార్పొరేష‌న్ మిగ‌తా అన్ని న‌ర్సింగ్ హోంల‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. భౌతిక దూరం, ఖ‌చ్చిత‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రించి క‌రోనా వైర‌స్ కేసులు కాకుండా దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న రోగుల‌కు మాత్ర‌మే సేవ‌లందించేందుకు క్లీనిక్‌ల‌ను తెరిచి ఉంచాల‌ని వెల్ల‌డించింది. కాగా, ముంబ‌య్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 5200 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు న‌మోద‌వ్వ‌గా, 200 మంది మృతిచెందారు