వరల్డ్ అప్డేట్: ప్రపంచవ్యాప్తంగా 42 లక్షలకు చేరువైన కరోనా కేసులు..

ప్రపంచంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ.. దీనికి అడ్డుకట్ట వేయడంలో మాత్రం విఫలమవుతూనే వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ వైరస్ 212 దేశాలకు పాకింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 4,181,221 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 283,877 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే 1,493,500 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. (కొంపముంచిన బర్త్ డే పార్టీ.. ఏకంగా 45 […]

వరల్డ్ అప్డేట్: ప్రపంచవ్యాప్తంగా 42 లక్షలకు చేరువైన కరోనా కేసులు..

Updated on: May 11, 2020 | 12:33 PM

ప్రపంచంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ.. దీనికి అడ్డుకట్ట వేయడంలో మాత్రం విఫలమవుతూనే వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ వైరస్ 212 దేశాలకు పాకింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 4,181,221 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 283,877 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే 1,493,500 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. (కొంపముంచిన బర్త్ డే పార్టీ.. ఏకంగా 45 మందికి కరోనా.. హైదరాబాద్‌లో టెన్షన్..)

అమెరికా, స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, రష్యా దేశాల్లో కరోనా ఉద్ధృత్తి తీవ్రతరంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(1,367,638), మరణాలు(80,787) సంభవించాయి. అటు స్పెయిన్‌లో పాజిటివ్ కేసులు 264,663 నమోదు కాగా, మృతుల సంఖ్య 26,621కు చేరింది. ఇక ఇటలీ, బ్రిటన్, రష్యాలలో పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల పైగా నమోదయ్యాయి. కాగా, భారత్‌లో కరోనా కేసులు 67,259 నమోదు కాగా, మృతుల సంఖ్య 2,212కి చేరింది.  (డేంజర్ బెల్స్: మరో రెండు వారాల లాక్‌డౌన్‌కు సిద్దంకండి..)

Read More:

నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్‌కు ప్రాణ సంకటం.!

హిందూ మతంలోకి మారిన 250 మంది ముస్లింలు.!