తేమ నియంత్రణతో కరోనా వ్యాప్తికి కట్టడి

భవనాల లోపలి గాల్లోని తేమను నియంత్రించడం వలన కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయొచ్చని భారత్‌-జర్మనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తేమ నియంత్రణతో కరోనా వ్యాప్తికి కట్టడి
coronavirus

Edited By:

Updated on: Aug 22, 2020 | 7:49 AM

Coronavirus spread control: భవనాల లోపలి గాల్లోని తేమను నియంత్రించడం వలన కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయొచ్చని భారత్‌-జర్మనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆసుపత్రులు, ఆఫీసులతో పాటు రైళ్లు, బస్సులు వంటి రవాణా వ్యవస్థల్లోనూ గాల్లోని తేమను 40-60 శాతానికి పరిమితం చేయడం వలన వైరస్ వ్యాప్తికి బ్రేక్ వేయొచ్చని వారు తెలిపారు. సీఎస్‌ఐఆర్‌కి చెందిన నేషనల్ ఫిజికల్ ల్యాబోరేటరీ, జర్మనీలోని లిబ్నిజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ట్రోపోస్పియర్ రీసెర్చ్‌లు ఈ పరిశోధనలో పాల్గొనగా.. ఆ వివరాలను ఏరోసాల్‌ అండ్‌ ఎయిర్‌ క్వాలిటీ రీసెర్చ్‌ జర్నల్‌ సంచికలో ప్రచురితం అయ్యాయి.

గాల్లోని తేమ శాతం.. 5 మైక్రో మీటర్ల కంటే తక్కువ సైజు ఉన్న సూక్ష్మజీవులపై ప్రభావం చూపుతుందని వారు అన్నారు. ”గాల్లో తేమ 40 శాతం కంటే తక్కువ ఉన్నట్లైయితే కరోనా సోకిన వారు వదిలే తుంపర్లలోని కణాలు తక్కువ నీటి కణాలను ఆకర్షిస్తాయి. దీని వలన తేలికగా ఉండటంతో పాటు వైరస్ కణాలు ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. దీంతో ఇతరులకు సోకే అవకాశమూ ఎక్కువ అవుతుంది’’అని అధ్యయనంలో పాలు పంచుకొన్న శాస్త్రవేత్త అజిత్‌  వివరించారు. అంతేకాదు గాలిలో తేమ తక్కువగా ఉండటం వలన ముక్కు లోపలి పొరలు పొడిగా మారి, వైరస్‌ ఎక్కువగా చొచ్చుకుపోయే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. తేమశాతం ఎక్కువగా ఉంటే తుంపర్లు వేగంగా బరువెక్కి నేల రాలిపోతాయని అజిత్‌ వెల్లడించారు.

Read More:

తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఏపీ బీజేపీ

బాబు డైరెక్షన్‌లో రఘురామకృష్ణరాజు