గుడ్‌న్యూస్: కరోనాకు చెక్.. భారత్‌లో యాంటీ వైరల్ డ్రగ్ రిలీజ్..

| Edited By:

Jun 20, 2020 | 4:39 PM

ప్రాణాంతకమైన కరోనా వైరస్‌కు డ్రగ్‌ (ఔషధం)ని రిలీజ్ చేసినట్టు ప్రముఖ ఫార్మా సంస్థ గ్లెన్‌మార్క్ ప్రకటించింది. ముంబయికి చెందిన ఈ సంస్థ ఫాబిఫ్లూ తయారీ, మార్కెటింగ్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి శుక్రవారం అనుమతులు పొందింది. యాంటీ వైరల్ డ్రగ్ ఫావిపిరవిర్‌ను...

గుడ్‌న్యూస్: కరోనాకు చెక్.. భారత్‌లో యాంటీ వైరల్ డ్రగ్ రిలీజ్..
Follow us on

ప్రాణాంతకమైన కరోనా వైరస్‌కు డ్రగ్‌ (ఔషధం)ని రిలీజ్ చేసినట్టు ప్రముఖ ఫార్మా సంస్థ గ్లెన్‌మార్క్ ప్రకటించింది. ముంబయికి చెందిన ఈ సంస్థ ఫాబిఫ్లూ తయారీ, మార్కెటింగ్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి శుక్రవారం అనుమతులు పొందింది. యాంటీ వైరల్ డ్రగ్ ఫావిపిరవిర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. ఈ ఔషధాన్ని స్వల్ప నుంచి మధ్య స్థాయి వైరస్ లక్షణాలతో బాధపడుతున్న కరోనా రోగుల చికిత్సకు ఉపయోగించవచ్చని పేర్కొంది. కరోనా చికిత్స కోసం నోటి ద్వారా తీసుకునే మందులో ఆమెదం లభించిన.. మొదటి డ్రగ్‌ ఇదేనని వెల్లడించింది సంస్థ.

ఈ సందర్భంగా సంస్థ ఎండీ గ్లెన్ సల్దానా మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. మన ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. సరైన సమయంలో ఔషదానికి ఆమోదం లభించిందని. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఔషధంతో సమర్థవంతమైన చికిత్స అందించవచ్చు. ఫలితంగా వైరస్ ఒత్తిడిన తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు.

కాగా భారత్ విషయానికి వస్తే.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. గ‌డిచిన‌ 24 గంటల్లో కొత్త‌గా 14,516 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,95,048కి చేరింది. కాగా క‌రోనా మ‌ర‌ణాలు సంఖ్య క‌ల‌వ‌ర‌పెడుతోంది. నిన్న ఒక్క‌రోజే 375 మంది కోవిడ్-19 కార‌ణంగా చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 12,948 కి చేరింది. కాగా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన‌వారి సంఖ్య‌ 213831గా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 168269 ఉన్నాయి.

Read More: 

పీఎం కీలక నిర్ణయం.. వలస కూలీల లబ్ధి కోసం ప్రత్యేక పథకం..

ఏపీ స‌ర్కార్ సంచ‌ల‌నం.. అప్లై చేసిన ప‌ది పనిదినాల్లో పెన్ష‌న్…

ఒకే రోజు ‘ఏడు స్పెషల్ డేస్’.. ప్రపంచం అంతంతో పాటు..