కరోనా ఎఫెక్ట్: చైనాపై నష్ట పరిహారం కేసు నమోదు

| Edited By:

Apr 22, 2020 | 7:15 PM

కరోనా ఎఫెక్ట్‌తో చైనాపై నష్ట పరిహారం కేసు నమోదయ్యింది. కోవిడ్-19‌ని కప్పిపుచ్చి ప్రపంచ దేశాలకు చైనా నష్టాన్ని కలిగించిందని అమెరికాకు చెందిన మిస్సోరి రాష్ట్రం కేసు వేసింది. చైనా ప్రభుత్వంపైనే కాకుండా ఆ దేశ కమ్యునిష్టు పార్టీపై..

కరోనా ఎఫెక్ట్: చైనాపై నష్ట పరిహారం కేసు నమోదు
Follow us on

కరోనా ఎఫెక్ట్‌తో చైనాపై నష్ట పరిహారం కేసు నమోదయ్యింది. చైనా ప్రభుత్వంపైనే కాకుండా ఆ దేశ కమ్యునిష్టు పార్టీపై కూడా కేసు నమోదయ్యింది. కోవిడ్-19‌ని కప్పిపుచ్చి ప్రపంచ దేశాలకు చైనా నష్టాన్ని కలిగించిందని అమెరికాకు చెందిన మిస్సోరి రాష్ట్రం కోర్టులో కేసు వేసింది. కరోనా వ్యవహారంలో చైనా కావాలనే నిర్లక్ష్యం వహించిందని తన అఫిడవిట్‌‌లో పేర్కొంది మిస్సోరి రాష్ట్రం. వైరస్‌ వల్ల ప్రాణాలు కోల్పోయినందుకు, మనుషుల్ని ఇబ్బందికి గురి చేసినందుకు, తీవ్ర ఆర్థిక నష్టాలను కలిగించినందుకు తమకు నష్టపరిహారం ఇవ్వాలని ఆ రాష్ట్రం డిమాండ్ చేసింది.

ప్రపంచ దేశాలకు చైనా అబద్ధాలు చెప్పింది, విజిల్ బ్లోయర్లను సైలెన్స్ చేసింది, వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఎటువంటి శ్రద్ధ చూపలేదని మిస్సోరీ రాష్ట్ర అటార్నీ జనరల్ ఎరిక్ స్కిమిట్ తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన చైనా బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే చైనా మాత్రం ఎటువంటి తప్పు చేయలేదని చెబుతోంది. మిస్సోరి అధికారులు తమ న్యాయపరిహార కేసును చరిత్రాత్మకంగా వర్ణించారని అంటోంది చైనా. అయితే మిస్సోరి స్టేట్ వేసిన కేసుపై అమెరికా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read More: 

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

జగన్ ప్రభుత్వం వల్ల రూ.1400 కోట్లు వృథా.. కన్నా సంచలన వ్యాఖ్యలు

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

ట్రాన్స్‌జెండర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. అన్ని అప్లికేషన్స్‌లోనూ..