
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 21393 కేసులు నమోదు అయినట్లు మినిస్ట్రీ అఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రకటించింది. అందులో 16,454 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 4258 మంది కోలుకున్నారని వెల్లడించింది. అటు మరణాల సంఖ్య 681కి చేరినట్లు తెలిపింది. ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.
తాజా సమాచారం ప్రకారం ఏపీ-813, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ – 18, అరుణాచల్ ప్రదేశ్ – 1, అస్సాం – 35, బీహార్ – 143, ఛండీగర్-27, ఛత్తీస్‌ఘడ్-36, ఢిల్లీ-2248, గోవా-7, గుజరాత్-2407, హర్యానా-262, హిమాచల్‌ప్రదేశ్-40, జమ్ముకశ్మీర్-407, జార్ఖండ్ – 49, కర్ణాటక- 427, కేరళ-438, లడాక్-18, మధ్యప్రదేశ్-1592, మహారాష్ట్ర-5652, మణిపూర్-2, మిజోరం- 1, మేఘాలయా- 12, నాగాలాండ్- 0, ఒడిశా – 83, పుదుచ్చేరి -7, పంజాబ్-251, రాజస్థాన్-1890, తమిళనాడు-1629, తెలంగాణ-945, త్రిపుర – 2, ఉత్తరాఖండ్ – 46, యూపీ-1449, పశ్చిమ బెంగాల్-456 కేసులు ఉన్నాయి. అటు కరోనా మరణాలు అత్యధికంగా మహారాష్ట్ర(269)లో సంభవించగా.. ఆ తర్వాత గుజరాత్(103), మధ్యప్రదేశ్(80), ఢిల్లీ(48), రాజస్తాన్(27) రాష్ట్రాలు ఉన్నాయి.
Also Read:
కిమ్ కంటే యమ డేంజరట.. ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
జూన్ 1 వరకూ లాక్‌డౌన్.. సర్కార్ కీలక నిర్ణయం..
కరోనా వేళ.. పాక్‌కు గట్టి షాక్.. క్వారంటైన్‌కు ఇమ్రాన్ ఖాన్.!
డిగ్రీ విద్యార్ధులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..
కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ అగ్రస్థానం..
లాక్ డౌన్ వేళ.. అదిరిపోయే పబ్జీ కాంపిటీషన్.. ప్రో-ప్లేయర్స్ గెట్ రెడీ..