
కరోనా లాక్ డౌన్ వల్ల ధీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న పేషెంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రక్తం అవసరం పడేవారికి లాక్ డౌన్ పెను సమస్యాత్మకంగా మారింది. బ్లడ్ బ్యాంక్స్ లో రక్త నిల్వలు అడుగంటడంతో ఆస్పత్రి వర్గాల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు రక్తదాతలు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: మందుబాబులకు గుడ్ న్యూస్.. తెరుచుకోనున్న మద్యం షాపులు.. కానీ..
అంతేకాకుండా వారికి ప్రత్యేక పాసులు జారీ చేయాలని.. రక్త దానం శిబిరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనీ స్పష్టం చేసింది. రక్తం ఇచ్చే దాతల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తగిన చర్యలు చేపట్టి వారి నుంచి రక్తాన్ని సేకరించాలంది. దానికి కావాల్సిన పత్రాలు లేదా సర్టిఫికేట్లను జారీ చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు ఇచ్చింది.
Also Read: కరోనా వేళ.. కర్నూలులో కోతులు మృతి.. భయాందోళనలో ప్రజలు..