Covid 4th Wave: చాపకింద నీరులా కోరలుచాస్తోన్న కరోనా! కొత్తగా 10,000 పాజిటివ్‌ కేసులు..మృతులెందరంటే..

|

Jun 22, 2022 | 7:50 AM

గడచిన 24 గంటల్లో దేశంలో దాదాపు 9,923 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం (జూన్‌ 22) వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలోనే కరోనా కేసులు 2,613 మేర అధికంగా..

Covid 4th Wave: చాపకింద నీరులా కోరలుచాస్తోన్న కరోనా! కొత్తగా 10,000 పాజిటివ్‌ కేసులు..మృతులెందరంటే..
Covid 19
Follow us on

Nearly 10,000 New Covid Cases In 24 Hours: గడచిన 24 గంటల్లో దేశంలో దాదాపు 9,923 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం (జూన్‌ 22) వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలోనే కరోనా కేసులు 2,613 మేర అధికంగా నమోదైనట్లు తెల్పింది. గడచిన వారం రోజుల్లో తొలిసారిగా 10 వేలకు చేరువలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 79,313కు చేరుకుంది. అంతేకాకుండా గత 24 గంటల్లో 17 మంది కోవిడ్‌తో మృతి చెందినట్లు గణాంకాల్లో తెల్పింది. కోవిడ్‌ మృతుల సంఖ్య 5,24,890 పెరిగింది. దేశంలో కరోనా ఇన్ఫెక్షన్‌ 0.18 శాతం ఉండగా, రికవరీ రేటు 98.61 శాతంగా నమోదైనట్లు ఈ సందర్భంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజిటివ్‌ రేటు 2.55 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెల్పింది.

గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 2,300 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ముంబాయి 1,310 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీలో 1,060 ఫ్రెష్‌ కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 246 కరోనా కేసులు నమోదైనట్లు గణాంకాలు తెలిపాయి.