ఏపీలో కొత్తగా 43 పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాల్లోనే అత్యధికం..

Coronavirus Updates: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిన్న రాత్రి 9 గంటల తర్వాత నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు 43 కొత్త కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారించింది. దీనితో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 87కి చేరుకుంది. మంగళవారం మొత్తంగా 373 శాంపిళ్లను టెస్టులకు పంపగా.. అందులో 43 పాజిటివ్ కాగా.. 330 నెగటివ్ గా తేలాయి. కడప, ప్రకాశం […]

ఏపీలో కొత్తగా 43 పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాల్లోనే అత్యధికం..

Updated on: Apr 01, 2020 | 2:18 PM

Coronavirus Updates: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిన్న రాత్రి 9 గంటల తర్వాత నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు 43 కొత్త కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారించింది. దీనితో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 87కి చేరుకుంది.

మంగళవారం మొత్తంగా 373 శాంపిళ్లను టెస్టులకు పంపగా.. అందులో 43 పాజిటివ్ కాగా.. 330 నెగటివ్ గా తేలాయి. కడప, ప్రకాశం జిల్లాల్లో 15 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. అటు పశ్చిమ గోదావరి(13), విశాఖపట్నం(11), గుంటూరు(9), చిత్తూరు, తూర్పుగోదావరి, కృష్ణ జిల్లాల్లో ఆరు కేసులు చొప్పున నమోదు కాగా… నెల్లూరు(3), అనంతపురంలో రెండు, కర్నూల్ జిల్లాలో ఒక్క కేసు నమోదైంది.

ఇవి చదవండి:

చైనాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ రెడీ.. విదేశాల్లో ట్రయిల్స్..

చైనా మాస్క్‌లు, టెస్టింగ్ కిట్స్ నాసిరకం.. తిప్పి పంపేస్తున్న దేశాలు.!

కరోనా విలయం.. ప్రపంచవ్యాప్తంగా 42 వేల మరణాలు..