కరోనా విలయం.. ప్రపంచవ్యాప్తంగా 42 వేల మరణాలు..

Coronavirus Updates: కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దీని దెబ్బకు ఇప్పటికే చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచదేశాలు ఈ వైరస్ ను నివారించేందుకు కట్టడి చర్యలు చేపడుతున్న ఏ ప్రయోజనం ఉండటం లేదు. దీని తీవ్రత మరింతగా పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే 73,639 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. […]

కరోనా విలయం.. ప్రపంచవ్యాప్తంగా 42 వేల మరణాలు..
Follow us

|

Updated on: Apr 01, 2020 | 2:16 PM

Coronavirus Updates: కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దీని దెబ్బకు ఇప్పటికే చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచదేశాలు ఈ వైరస్ ను నివారించేందుకు కట్టడి చర్యలు చేపడుతున్న ఏ ప్రయోజనం ఉండటం లేదు. దీని తీవ్రత మరింతగా పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే 73,639 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 8,58,669 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీటిలో 178,099 మంది కోలుకున్నారు. ఇక 6,38,419 మంది చికిత్స పొందుతున్నారు. అటు మొత్తంగా మరణాల సంఖ్య 42,151కి చేరింది. ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతోంది. అక్కడ 1,88,530 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 3,889కి చేరింది.

ఇక ఇటలీ కరోనా దెబ్బకు శవాల దిబ్బగా మారింది. ఆ దేశంలో కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ 1,05,792 కేసులు ఉండగా.. ఈ వైరస్ కారణంగా 12,428 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో కరోనా వైరస్ కరాల నృత్యం చేస్తోంది. ఆ దేశంలో కోవిడ్ 19 సోకిన కేసులు 95,923కి చేరుకోగా.. మొత్తం మరణాలు 8464కి చేరాయి. ఇక చైనాలో 81518 కేసులుండగా… మరణాలు 3305గా ఉన్నాయి. అటు జర్మనీ, ఫ్రాన్స్, ఇరాన్, బ్రిటన్, స్విట్జర్లాండ్, టర్కీ, బెల్జియం, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, దక్షిణ కొరియా దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

మరోవైపు ఇండియా విషయానికి వస్తే.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1418 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. నిన్న ఒక్క రోజు 167 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అటు మరణాల సంఖ్య 45కు చేరింది. ఇక కరోనా వైరస్ నుంచి 123 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇవి చదవండి:

చైనాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ రెడీ.. విదేశాల్లో ట్రయిల్స్..

చైనా మాస్క్‌లు, టెస్టింగ్ కిట్స్ నాసిరకం.. తిప్పి పంపేస్తున్న దేశాలు.!

ఏపీలో కొత్తగా 43 పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాల్లోనే అత్యధికం..

Latest Articles