నగదు.. బియ్యం పంపిణీ ఎలా చేస్తారంటే..

| Edited By:

Mar 23, 2020 | 9:09 AM

కరోనా వైరస్ నేపథ్యంలో.. పేదలకు సీఎం కేసీఆర్ తెల్లరేషన్ కార్డున్నవారికి బియ్యంతో పాటు నగదు కూడా పంపిణీ చేస్తామని ప్రకటించారు. అయితే నగదు, బియ్యం పంపిణీ ఎలా చేయాలనే విషయమై అధికారులు కసరత్తులు..

నగదు.. బియ్యం పంపిణీ ఎలా చేస్తారంటే..
Follow us on

కరోనా వైరస్ నేపథ్యంలో.. పేదలకు సీఎం కేసీఆర్ తెల్లరేషన్ కార్డున్నవారికి బియ్యంతో పాటు నగదు కూడా పంపిణీ చేస్తామని ప్రకటించారు. అయితే నగదు, బియ్యం పంపిణీ ఎలా చేయాలనే విషయమై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. తెల్లరేషన్ కార్డు గలవారికి ఒక్కో వ్యక్తికి ఉచితంగా 12 కిలోల బియ్యం, ఇతర సరుకులు కొనుగోలుకు ఒక్కో కుటుంబానికి రూ.1500 ఇస్తామని కేసీఆర్ తెలిపారు. బియ్యంతో పాటు కొన్ని రకాల సరుకులను కూడా ఇవ్వాలని అధికారులు ఆలోచించినా.. కుదరని పక్షంలో నగదును ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారట.

కాగా బియ్యంమైతే.. ఇంటింటికి పంపిణీ చేయవచ్చు. కానీ నగదును ఎలా పంపిణీ చేయాలా అని అధికారుల తీవ్ర ఆలోచనలు చేస్తున్నారట. సీఎం ప్రకటించిన రూ.1500 నగదు రూపంలో ఇవ్వడమా? లేక కార్డు దారుల బ్యాంకు ఖాతాలో జమ చేయడమా? అనే విషయంలోనూ సోమవారం స్పష్టత వచ్చే అవకాశముందని ఉన్నతాధికారులు తెలిపారు. అయితే.. బ్యాంకు ఖాతాల వివరాలు పౌరసరఫరాల శాఖ గతంలో సేకరించింది. ఆ ఖాతాలు ప్రస్తుతం చెల్లుబాటులో ఉన్నాయా? లేదా? అని పరిశీలిస్తున్నారు.

అలాగే లాక్ డౌన్ నేపథ్యంలో బ్యాంకుల్లో సిబ్బంది తక్కువగా ఉంటే ప్రజలకు సమస్య ఏర్పడే అవకాశామూ లేకపోలేదు. సొమ్ము కోసం బ్యాంకుల వద్ద ప్రజలు అధిక సంఖ్యలో చేరితే ఇబ్బందికరంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఇలా పలు విషయాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. అయితే సాధ్యాసాధ్యాలను పరిశీలించాక నగదు రూపంలో ఇవ్వడమే మంచిదన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం.

Read more also: బ్రేకింగ్ న్యూస్: రెండు తెలుగు రాష్ట్రాల బోర్డర్లు బంద్

మార్చి 31 వరకూ తెలంగాణలో ఆల్ మద్యం షాపులు బంద్

ఫ్లాష్ న్యూస్: మార్చి 31వ తేదీ వరకూ తెలంగాణ లాక్‌డౌన్

జనతా కర్ఫ్యూ తర్వాత ప్రజలకు మోదీ మరో సూచన

ఇంట్లో ఉంటే కరోనా రాదనుకుంటే పొరపాటే.. సూచనలు ఇవే!

బ్రేకింగ్ న్యూస్: ఈ నెల 31 వరకూ బస్సులు, రైళ్లు సర్వీసులు బంద్