పాక్‌లో డిన్నర్ టైమ్‌కు కరోనా వస్తుందట..

ప్రపంచానికి కరోనాపై తీపికబురు చెప్పిన పాకిస్తాన్ ప్రధాని అంటూ ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో సారాంశం ఏంటంటే...

పాక్‌లో డిన్నర్ టైమ్‌కు కరోనా వస్తుందట..

Updated on: May 17, 2020 | 3:56 PM

ప్రపంచదేశాలను భయపెడుతున్న కరోనా వైరస్.. ఆ దేశంలో టైమింగ్ పెట్టుకుని మరీ వ్యాప్తి చెందుతుందట. వినడానికి ఇది కొంచెం విడ్డూరంగా ఉన్నా, నిజమండీ.. స్వయంగా ఈ వ్యాఖ్యలు ఆ దేశ గవర్నర్లలో ఒకరు చేసినవే. ఇక ఆ దేశం మరేదో కాదు దాయాది పాకిస్తాన్. ప్రపంచానికి కరోనాపై తీపికబురు చెప్పిన పాకిస్తాన్ ప్రధాని అంటూ ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ వీడియో సారాంశం ఏంటంటే… అక్కడ స్థానిక న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆ దేశ గవర్నర్ ఒకరు ‘సాయంత్రం పూట 5 గంటల తర్వాత పాకిస్తాన్‌లో కరోనా వైరస్ వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనితో సాయంత్రం 5 గంటలలోపు ప్రజలందరూ కూడా ఎక్కడికైనా తిరవచ్చునని, ఎలాంటి ఇబ్బంది ఉండదని అని అక్కడ స్థానిక న్యూస్ ఛానల్స్‌లలో వార్తలు వచ్చాయి. ఇక దానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది. పాకిస్తాన్‌లో కరోనా టైమింగ్ పెట్టుకుని వ్యాప్తి చెందుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read More:

ఏపీలో జిల్లాల వారీగా రెడ్ జోన్ ప్రాంతాలు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రాంతాల్లోనే కఠిన ఆంక్షలు!

వలస కూలీలకు ఉచిత ప్రయాణం.. జగన్ మార్క్ డెసిషన్

తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. ఆ మూడు రాష్ట్రాల నుంచి రాకపోకలు నిషేధం..

రేపటి నుంచి లాక్‌డౌన్‌ 4.0.. రూల్స్ ఇలా ఉండనున్నాయా!