Corona World: వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 5.68 లక్షలు…

|

Jul 12, 2020 | 6:38 PM

ప్రపంచవ్యాప్తంగా 12,874,441 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 568,325 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 7,503,118 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Corona World: వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 5.68 లక్షలు…
Follow us on

Coronavirus Cases In World: ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశాలన్నీ కూడా దశల వారీగా లాక్ డౌన్ విధించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 12,874,441 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 568,325 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 7,503,118 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో 4996 మరణాలు సంభవించాయి. అయితే మరణాల రేటు కంటే రికవరీ రేటు అధికంగా ఉండటంతో ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు.

అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. ప్రస్తుతం అన్ని దేశాలూ లాక్ డౌన్ దశల వారీగా సడలిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(3,357,130), మరణాలు(137,418) సంభవించాయి. అటు బ్రెజిల్ లో పాజిటివ్ కేసులు 1,840,812 నమోదు కాగా, మృతుల సంఖ్య 71,492కు చేరింది. ఇక రష్యాలో 727,162 పాజిటివ్ కేసులు, 11,335 మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు 854,480 నమోదు కాగా, మృతుల సంఖ్య 22,718కి చేరింది.

Also Read:

విద్యార్ధులకు ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఏపీ: ఆగష్టు 3 నుంచి ఇంటర్ కళాశాలల రీ-ఓపెన్.. 196 పనిదినాలు..!

ఏపీలో రెడ్ జోన్‌లోకి 97 ప్రాంతాలు.. వివరాలివే.!