Breaking News
  • రేపు 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్. కోవిడ్-19 స్థితిగతులపై ఉదయం గం. 11.00కు ప్రారంభం కానున్న సమావేశం. వీడియో కాన్ఫరెన్సులో ఆంధ్రప్రదేశ్, బిహార్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చీఫ్ సెక్రటరీలు. ప్రధానితో పాటు సమావేశంలో పాల్గొననున్న కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, డా. హర్షవర్థన్, కిషన్ రెడ్డి, కేబినెట్ సెక్రటరీ, హోం సెక్రటరీ. నేడు 6 రాష్ట్రాల సీఎంలతో జరిగిన సమావేశంలో కూడా కిషన్ రెడ్డికి చోటు.
  • విజయవాడ : చోటా రౌడీ గ్యాంగ్ ని అరెస్టు చేసిన అజిత్ సింగ్ నగర్ పొలీసులు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో స్ట్రీట్ ఫైట్ చేధించిన అజిత్ సింగ్ నగర్ పోలీసులు. పాత గొడవలు నేపథ్యంలో పుట్ట వినయ్ అనే యువకుడి పై ముకుమ్మడిగా దాడి చేసిన ఐదుగురు యువకులు. గాయాల పాలైన యువకుడు అజిత్ సింగ్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు. గంటల వ్యవధిలో కేసుని ఛేదించిన పోలీసులు.
  • ఇంటర్ డిగ్రీ అడ్మిషన్లపై నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ. -ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహించనున్న తెలంగాణ ప్రభుత్వం. ఇంటర్ - సెప్టెంబర్ 1 తర్వాత అడ్మిషన్స్ పై నిర్ణయం డిగ్రీ - 28 నుంచి అడ్మిషన్స్ . సెట్స్ : Ecet - aug 8. Mcet- 9,10,11,14 sep Poly set - 2 sep ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అన్ని TCS ద్వారా ఆన్లైన్ పరీక్షలు. Degree పరీక్షలు సుప్రీం చెప్పిన తర్వాత నిర్ణయం . 17 ఇంటర్ నుంచి డిజిటల్ క్లాసులు ప్రారంభం .
  • రాజస్థాన్‌ రాజకీయాల్లో శరవేగంగా మారుతున్న పరిణామాలు. పార్టీకి మళ్లీ దగ్గరవుతున్న తిరుగుబాటు నేత సచిన్ పైలట్. రాహుల్, ప్రియాంక గాంధీలతో సచిన్ మంతనాలు. సీఎం అశోక్ గెహ్లోత్ తీరుపై తీవ్ర అభ్యంతరాలు. అధిష్టానం ముందు తన డిమాండ్లు ఏకరువు పెట్టిన పైలట్. సచిన్ లేవనెత్తిన అంశాల పరిష్కారానికి కమిటీ. ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.
  • తిరుపతి ఎస్వీబీసీ ఛానెల్ సీఈఓగా కేంద్ర సమాచార శాఖ అధికారి సురేష్ కుమార్ గెదెలను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం. ప్రస్తుతం విజయవాడలోని దూరదర్శన్ కేంద్రంలో డిప్యూటీ డైరెక్టరుగా పనిచేస్తున్న సురేష్ కుమార్. కేంద్ర సర్వీసుల నుంచి డెప్యుటేషనుపై రాష్ట్ర సర్వీసులోకి చేరిన సురేష్ కుమార్.
  • సాధారణ మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసెంజర్ రైలు సర్వీసుల రద్దు సెప్టెంబర్ 30 వరకు కొనసాగింపు. ప్రస్తుతం నడుస్తున్న స్పెషల్ ట్రైన్లు మాత్రం నడుస్తాయి. రైల్వే బోర్డు తాజా ప్రకటన.
  • మణిపూర్ అసెంబ్లీలో బలనిరూపణలో గెలిచిన బీజేపీ. సభలో 28 మంది బీజేపీ, 16మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల హాజరు. గైర్హాజరైన 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఓటింగ్ అనంతరం నినాదాలతో హంగామా చేసిన కాంగ్రెస్. కుర్చీలను విసిరేసిన నిరసన తెలిపిన కాంగ్రెస్.

Big Story: కరోనా వైరస్..చైనా నాయకత్వానికి అంతా తెలుసు.. వైరాలజిస్ట్

China Corona Virus, Big Story: కరోనా వైరస్..చైనా నాయకత్వానికి అంతా తెలుసు.. వైరాలజిస్ట్

కరోనా వైరస్ ఔట్ బ్రేక్ గురించి చైనా ప్రభుత్వానికి తెలిసినప్పటికీ దాచిపెట్టిందని  ఓ వైరాలజిస్ట్ ప్రకటించారు. ఏ సమాచారం గురించి తెలిసినవారినైనా ఎలా అణగదొక్కాలో వారికి తెలుసునని, ఇది తెలిసే తాను అమెరికాకు పారిపోయాయని డా.లీ-మెంగ్ యాన్ అనే ఈ వైరాలజిస్ట్ వెల్లడించారు. హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో వైరాలజీ, ఇమ్యునాలజీలో స్పెషలైజ్ చేసిన ఈమె.. ఫాక్స్ న్యూస్ కి సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ వైరస్ ఔట్ బ్రేక్ పై తను  చేసిన రీసెర్చ్ ని కొందరు ఉన్నత స్థాయి నిపుణులే నిర్లక్ష్యం చేశారని ఆమె ఆరోపించింది. ఈ వైరస్ గురించి బీజింగ్ నాయకత్వానికి ముందే తెలుసు.. నా పరిశోధనలు చివరికి కోవిడ్-19 వివరాలు బయటి ప్రపంచానికి తెలిసేందుకు దోహదం చేశాయి అని లీ మెంగ్ యాన్ పేర్కొంది. తన రీసెర్చ్ అనేకమందిని రక్షించి ఉండవచ్చునని, కానీ ‘కొందరి’ కారణంగా అలా జరగలేదని ఆమె వాపోయింది. తన పరిశోధనా ఫలితాలను ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రాణాలకు తెగించి అమెరికాకు పారిపోయి వచ్చానని ఆమె పేర్కొంది. హాంకాంగ్ కి తిరిగి రాలేనని  కూడా భయపడ్డానని చెప్పింది.

ఇన్ ఫ్లూయెంజా వైరస్ లు, పాండమిక్స్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు ‘రెఫరెన్స్ ల్యాబ్’ గా స్పెషాలిటీని కలిగిఉన్న చైనాకు ఈ విషయాన్ని తెలియజేయాల్సిన బాధ్యత ఉందని,  అదే  సమయంలో ఆ సంస్థను నేను అలర్ట్ చేయబోయినా ఫలితం లేకపోయిందని, వారు ఎలాంటి చర్యా తీసుకోలేదని లీ-మెంగ్ యాన్ విమర్శించింది. అసలు ఈ వైరస్ గురించి స్టడీ చేసింది మొదట నేనే ! దాన్నే ఆ తరువాత కోవిడ్-19 గా వ్యవహరించారు.. అని ఆమె స్పష్టంగా పేర్కొంది. గత ఏడాది డిసెంబరులోనే యూనివర్సిటీ లోని తమ సూపర్ వైజర్ డా.లియో పూన్.. చైనాలో సార్స్ వంటి కేసులున్నాయా అని ప్రశ్నించారట..  కాగా- హాంకాంగ్ తో బాటు అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని రప్పించేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించిందని, ఇక్కడే రీసెర్చ్ జరగాలని కోరిందని ఆమె తెలిపింది.

మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్ గురించి డిసెంబరు 31 న నా ఫ్రెండ్ నాకు స్పష్టంగా తెలిపింది. అదే రోజున 27 న్యుమోనియా క్లస్టర్ కేసులు వూహాన్ లో బయటపడ్డాయి అని వెల్లడించిన ఆమె.. తన స్నేహితురాలు చెప్పిన విషయాన్నీ, తన తదనంతర పరిశోధనా ఫలితాలను సీనియర్ నిపుణుడికి తెలియజేయగా.. ‘నీ రీసెర్చ్ నువ్వు చూసుకో’ అని దురుసుగా మాట్లాడాడని వెల్లడించింది. ‘రెడ్ లైన్ ముట్టకు.. మనం చిక్కుల్లో పడతాం.. కనుమరుగైపోతాం’ అని ఆయన చీవాట్లు పెట్టినంత పని చేశాడట.

ప్రస్తుతం దాదాపు అజ్ఞాతంలో ఉన్న లీ.. తనకు ప్రాణహాని ఉందని భయపడుతోంది. తనపై సైబర్ దాడులు జరగవచ్చునన్న ఆందోళనను వ్యక్తం చేసింది. తన కుటుంబ సభ్యులకు కూడా హాని తలపెట్టవచ్ఛు అని కూడా అనుమానం వ్యక్తం చేసింది. కాగా-హాంకాంగ్ యూనివర్సిటీ తమ వెబ్ సైట్ పేజ్ లో… లీ-మెంగ్ యాన్ పేరును తొలగిస్తూ.. ఆమె తమ స్టాఫ్ సభ్యురాలు కాదని పేర్కొంది. కరోనా వైరస్ ఆవిర్భావానికి చైనాయే కారణమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదేపనిగా ఆరోపిస్తున్న వేళ.. ఈ వైరాలజిస్ట్ ఇఛ్చిన ఇంటర్వ్యూ అత్యధిక ప్రాధాన్యం సంతరించుకుంది.

 

Related Tags