AP Corona Cases: ఏపీ కరోనా బులిటెన్.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే..!

|

Jun 13, 2021 | 6:35 PM

AP corona cases: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,770 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,09,844కి చేరింది.

AP Corona Cases: ఏపీ కరోనా బులిటెన్.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే..!
Coronavirus Cases In AP
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,770 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,09,844కి చేరింది. ఇందులో 85,637 యాక్టివ్ కేసులు ఉండగా.. 17,12,267 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో 58 మంది మృతి చెందారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 11,940కు చేరుకుంది. ఇక నిన్న 12,492 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 2,04,50,982 సాంపిల్స్‌ను పరీక్షించారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 1041, చిత్తూరు 1658, తూర్పుగోదావరి 1199, గుంటూరు 433, కడప 473, కృష్ణా 440, కర్నూలు 299, నెల్లూరు 267, ప్రకాశం 530, శ్రీకాకుళం 491, విశాఖపట్నం 290, విజయనగరం 248, పశ్చిమ గోదావరి 765 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

ఇవి కూడా చదవండి: Monsoon update: రైతులకు ముఖ్య సూచన.. మరో మూడు రోజుల పాటు వర్షాలు..

Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు జాబితా రెడీ.. ఎల్లుండి నుంచి ఖాతాల్లోకి నిధులు..

CJ NV Ramana: సీజేఐ ఎన్వీ రమణ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పు… మరో రోజు యాదాద్రి దర్శనంకు రానున్న చీఫ్ జస్టీస్