తెలంగాణ సర్కార్ సంచలనం.. ఇంటింటికీ ర్యాపిడ్ ఫీవర్ సర్వే..

|

Apr 07, 2020 | 7:56 AM

Coronavirus Outbreak: తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. మొదటి ఫేజ్‌లో కరోనా కంట్రోల్‌లోకి వచ్చినప్పటికీ నిజాముద్దీన్ మర్కజ్ ఘటన బయటపడటంతో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక ప్రస్తుతం పాజిటివ్ తేలిన వారిని ఐసోలేషన్ కేంద్రాల్లో, అనుమానితులను ట్రావెల్ హిస్టరీ ఆధారంగా హోం క్వారంటైన్‌లో ఉంచడమో లేక ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించడం వంటివి చేస్తున్నారు. ఈ నేపధ్యంలో పాజిటివ్ కేసులున్న వారి ఇంటి చుట్టుప్రక్కల కిలోమీటర్ పరిధి వరకు వైద్య బృందాలతో […]

తెలంగాణ సర్కార్ సంచలనం.. ఇంటింటికీ ర్యాపిడ్ ఫీవర్ సర్వే..
Follow us on

Coronavirus Outbreak: తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. మొదటి ఫేజ్‌లో కరోనా కంట్రోల్‌లోకి వచ్చినప్పటికీ నిజాముద్దీన్ మర్కజ్ ఘటన బయటపడటంతో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక ప్రస్తుతం పాజిటివ్ తేలిన వారిని ఐసోలేషన్ కేంద్రాల్లో, అనుమానితులను ట్రావెల్ హిస్టరీ ఆధారంగా హోం క్వారంటైన్‌లో ఉంచడమో లేక ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించడం వంటివి చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో పాజిటివ్ కేసులున్న వారి ఇంటి చుట్టుప్రక్కల కిలోమీటర్ పరిధి వరకు వైద్య బృందాలతో కలిసి ఇంటింటికీ ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేయనున్నారు. ఈ సర్వే ఆధారంగా జలుబు, జ్వరం, దగ్గు లాంటి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానాలుంటే వారి రక్త నమూనాలను తీసుకుని పరీక్షలకు పంపించి.. ఎవరికైన పాజిటివ్ ఉన్నదా లేదా అన్నది తెలుసుకుంటారు. అలాగే పోలీసుల ఆధ్వర్యంలో కార్దన్ ఆఫ్ వంటివి కూడా చేపట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను హాట్ స్పాట్స్‌గా గుర్తించనున్నారు. వీటి దగ్గర మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నారు. ఇలా రాష్ట్రంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా చీఫ్ సెక్రటరీ, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే మర్కజ్ వెళ్ళినవారితో లింకులు ఉన్న ప్రాంతాల్లో జియో ట్యాగింగ్ పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు.

ఇది చదవండి: డేంజర్ బెల్స్: మరిన్ని రోజులు లాక్ డౌన్‌కు సిద్దంకండి…