డేంజర్ బెల్స్: మరిన్ని రోజులు లాక్ డౌన్‌కు పొడిగింపు.!

Coronavirus Outbreak: ఇండియాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కేసుల సంఖ్య 4067కు చేరుకోగా.. నిన్న ఒక్కరోజే 427 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 109 మంది మృత్యువాతపడ్డారు. అటు ముంబైలో అయితే ఆదివారం ఏకంగా 103 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతి చెందారు. దీనితో మహారాష్ట్రలో మొత్తం 45 మంది మృతి […]

డేంజర్ బెల్స్: మరిన్ని రోజులు లాక్ డౌన్‌కు పొడిగింపు.!
Follow us

|

Updated on: Apr 06, 2020 | 6:29 PM

Coronavirus Outbreak: ఇండియాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కేసుల సంఖ్య 4067కు చేరుకోగా.. నిన్న ఒక్కరోజే 427 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 109 మంది మృత్యువాతపడ్డారు. అటు ముంబైలో అయితే ఆదివారం ఏకంగా 103 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతి చెందారు. దీనితో మహారాష్ట్రలో మొత్తం 45 మంది మృతి చెందారు. కరోనా పాజిటివ్‌ కేసులు 650పైగా నమోదయ్యాయి.

మహారాష్ట్రలో కరోనా తీవ్రత తారాస్థాయిలో ఉందని చెప్పవచ్చు. దీనితో ఏప్రిల్ 14న ముగియనున్న దేశవ్యాప్త లాక్ డౌన్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతోన్న పాజిటివ్ కేసులు దృష్ట్యా ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. తాజాగా ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపే జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ముంబైలో మరిన్ని రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉందని అన్నారు.

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో 21 రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగుతోంది. మార్చి 25న ప్రారంభమైన ఈ లాక్ డౌన్.. ఏప్రిల్ 14తో ముగియనుంది. ఈ సమయంలో అత్యవసర సేవలు మినహాయించి.. ప్రజా రవాణా అంతా బంద్ అయింది. అయితే మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్‌ను పొడిగించే అవకాశం ఉండొచ్చని రాజేష్ టోపే స్పష్టం చేశారు.

అయితే దీనిపై తుది నిర్ణయం ఏప్రిల్ 12న తీసుకుంటామని.. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో ఎన్ని రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించాలన్న అంశాలపై చర్చిస్తామన్నారు. కాగా, ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లినవారిలో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్ తేలడంతో దేశంలో ఒక్కసారిగా కరోనా కేసులు అమాంతం పెరిగిపోయాయి.

For More News:

ఫ్లాష్: లాక్ డౌన్.. ఇళ్లల్లోనే జనాలు.. ఏపీలో తగ్గిన నేరాలు..

వాళ్లపై పోలీస్ కంప్లైంట్ ఇస్తా.. ఎమోషనల్ అయిన గెటప్ శ్రీను..

కరోనా విలయం.. ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల కేసులు, 69 వేల మృతులు..

2011 ప్రపంచకప్ ఫైనల్‌: యువరాజ్ స్థానంలో ధోనిని ముందు వెళ్లమన్నా..

Breaking: ఏపీలో కొత్తగా 14 కరోనా కేసులు.. ఇద్దరు మృతి..

డాక్టర్ల నిర్లక్ష్యం.. ఐసీయూ తాళాలు దొరక్క వృద్ధురాలు మృతి..

ఫ్లాష్ న్యూస్: దేశంలో 4000 దాటిన పాజిటివ్ కేసులు.. ఆ 11 రాష్ట్రాల్లోనే అత్యధికం…

సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.

కర్నూలులో కంటైన్‌మెంట్ జోన్లు.. నిత్యావసరాలు సైతం బంద్.!

వైద్యుల భద్రతపై తెలంగాణ డీజీపీ కీలక నిర్ణయం.. ఇకపై..