వైద్యుల భద్రతపై తెలంగాణ డీజీపీ కీలక నిర్ణయం.. ఇకపై..

Coronavirus Outbreak: కరోనాను కట్టడి చేయడంలో రాత్రింబవళ్ళు కష్టపడుతున్న వైద్యుల రక్షణ కోసం తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల చనిపోయిన కరోనా పేషంట్ బంధువులు వైద్యులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించగా.. తెలంగాణ పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమయ్యారు. డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, పారా మెడికల్ సిబ్బంది భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన […]

వైద్యుల భద్రతపై తెలంగాణ డీజీపీ కీలక నిర్ణయం.. ఇకపై..
Follow us

|

Updated on: Apr 06, 2020 | 2:42 PM

Coronavirus Outbreak: కరోనాను కట్టడి చేయడంలో రాత్రింబవళ్ళు కష్టపడుతున్న వైద్యుల రక్షణ కోసం తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల చనిపోయిన కరోనా పేషంట్ బంధువులు వైద్యులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించగా.. తెలంగాణ పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమయ్యారు. డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, పారా మెడికల్ సిబ్బంది భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో పని చేస్తున్న వైద్యుల రక్షణ కోసం పోలీసు కమిషనరేట్లు, పోలీసు ఉన్నతాధికారులతో కలిపి ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రూపుల ద్వారా పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడూ డాక్టర్లతో సంప్రదింపులు జరుపుతూ.. వారి భద్రతకు కావాల్సిన చర్యలను తీసుకుంటారన్నారు. ఎవరికైన ఏదైనా ఇబ్బంది ఏర్పడితే.. ఆ సమాచారాన్ని గ్రూపులో పోస్టు చేస్తే త్వరగా స్పందించేందుకు వీలు ఉంటుందని డీజీపీ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని వైద్యులు, పోలీసులతో కలిపి ప్రత్యేకంగా మెడికల్ వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటు కాగా.. నగర పరిధిలోని డాక్టర్లు, జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, హెల్త్ వర్కర్లు, ఆశా వర్కర్లను కలిపి నోడల్ వాట్సప్ గ్రూపును మొదలుపెట్టామని తెలిపారు.

For More News:

ఫ్లాష్: లాక్ డౌన్.. ఇళ్లల్లోనే జనాలు.. ఏపీలో తగ్గిన నేరాలు..

వాళ్లపై పోలీస్ కంప్లైంట్ ఇస్తా.. ఎమోషనల్ అయిన గెటప్ శ్రీను..

కరోనా విలయం.. ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల కేసులు, 69 వేల మృతులు..

2011 ప్రపంచకప్ ఫైనల్‌: యువరాజ్ స్థానంలో ధోనిని ముందు వెళ్లమన్నా..

Breaking: ఏపీలో కొత్తగా 14 కరోనా కేసులు.. ఇద్దరు మృతి..

డాక్టర్ల నిర్లక్ష్యం.. ఐసీయూ తాళాలు దొరక్క వృద్ధురాలు మృతి..

ఫ్లాష్ న్యూస్: దేశంలో 4000 దాటిన పాజిటివ్ కేసులు.. ఆ 11 రాష్ట్రాల్లోనే అత్యధికం…

డేంజర్ బెల్స్: మరిన్ని రోజులు లాక్ డౌన్ పొడిగింపు..!

సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.

కర్నూలులో కంటైన్‌మెంట్ జోన్లు.. నిత్యావసరాలు సైతం బంద్.!