ఫ్లాష్: లాక్ డౌన్.. ఇళ్లల్లోనే జనాలు.. ఏపీలో తగ్గిన నేరాలు..

Coronavirus Lockdown: దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పలు చోట్ల నేరాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. తాజాగా జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో క్రైమ్ రేట్ కనిష్టానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఇండియాలో క్రైమ్ రేట్ భారీగా తగ్గిందని చెప్పవచ్చు. తాజా […]

ఫ్లాష్: లాక్ డౌన్.. ఇళ్లల్లోనే జనాలు.. ఏపీలో తగ్గిన నేరాలు..
Follow us

|

Updated on: Apr 06, 2020 | 2:42 PM

Coronavirus Lockdown: దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పలు చోట్ల నేరాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. తాజాగా జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో క్రైమ్ రేట్ కనిష్టానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఇండియాలో క్రైమ్ రేట్ భారీగా తగ్గిందని చెప్పవచ్చు. తాజా రిపోర్టు ప్రకారం సుమారు 33 నుంచి 55 శాతం మేరకు క్రైమ్స్ తగ్గాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. రోడ్లపై జనాలు తిరగకపోవడం, పోలీసుల గస్తీ, నిఘా పెరగడంతోనే ఇది సాధ్యమయ్యిందని అధికారులు అంటున్నారు. మరోవైపు లాక్ డౌన్ వల్ల రోడ్డు ప్రమాదాలు బాగా తగ్గినట్లు తెలుస్తోంది. గతంలో ఏపీలో నిత్యం 63 రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతుండగా.. అందులో 18 మంది మృత్యువాతపడేవారు. ఇక మార్చిలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి కేవలం 140 రోడ్డు ప్రమాదాలు మాత్రమే రిజిస్టర్ అయ్యాయని తెలుస్తోంది. అటు కిడ్నాప్ కేసుల సంఖ్య 2.5కు పడిపోయింది. ఇక హత్య కేసుల సంఖ్య కూడా 1.4కు తగ్గినట్లు నివేదిక చెబుతోంది.

ఇదే విషయంపై విజయవాడ పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ ‘ గతంలో చాలావరకు ఇంటి తగాదా, కిడ్నాప్, హత్య కేసుల వంటివి నమోదు చేశామని.. అయితే గడిచిన రెండు వారాల్లో వీటి సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పుకొచ్చారు. అటు రేప్ కేసులు, లైంగిక దాడులు, సైబర్ క్రైమ్ కేసులు కూడా బాగా తగ్గాయన్నారు. ఇక ప్రస్తుతం విజయవాడలో క్రైమ్ రేట్ తగ్గిందని.. కేవలం లాక్ డౌన్ ఉల్లంఘన కేసులు మాత్రమే పెరగాయని ఆయన తెలిపారు. తెలంగాణలో కూడా నేరాలు 55 శాతం తగ్గాయని.. అలాగే రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్లు నివేదికలో తేలింది. ఇక మార్చి నెలలో దోపిడీలు, రాబరీ, పగటి చోరీలు, రాత్రి పూట దొంగతనాలు, దొంగతనాలు, హత్యలు, అల్లర్లు, కిడ్నాప్‌ లు, లైంగిక దాడులు, గాయపరిచిన కేసులు, స్వల్ప దాడులు, మోసాలు, నమ్మక ద్రోహం, హత్యాయత్నాలు, తీవ్ర రోడ్డు ప్రమాదాలు, సాధారణ రోడ్డు ప్రమాదాలు, ఐపీసీలోని ఇతర సెక్షన్ల కింద నమోదైన కేసులతో 3,599 కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది.

For More News:

వాళ్లపై పోలీస్ కంప్లైంట్ ఇస్తా.. ఎమోషనల్ అయిన గెటప్ శ్రీను..

కరోనా విలయం.. ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల కేసులు, 69 వేల మృతులు..

2011 ప్రపంచకప్ ఫైనల్‌: యువరాజ్ స్థానంలో ధోనిని ముందు వెళ్లమన్నా..

Breaking: ఏపీలో కొత్తగా 14 కరోనా కేసులు.. ఇద్దరు మృతి..

డాక్టర్ల నిర్లక్ష్యం.. ఐసీయూ తాళాలు దొరక్క వృద్ధురాలు మృతి..

ఫ్లాష్ న్యూస్: దేశంలో 4000 దాటిన పాజిటివ్ కేసులు.. ఆ 11 రాష్ట్రాల్లోనే అత్యధికం…

డేంజర్ బెల్స్: మరిన్ని రోజులు లాక్ డౌన్ పొడిగింపు..!

సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.

కర్నూలులో కంటైన్‌మెంట్ జోన్లు.. నిత్యావసరాలు సైతం బంద్.!

వైద్యుల భద్రతపై తెలంగాణ డీజీపీ కీలక నిర్ణయం.. ఇకపై..