కరోనా వేళ.. శానిటేషన్ వర్కర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా..

|

Apr 13, 2020 | 6:48 PM

ఏపీలో కరోనా కోర‌లు చాస్తోంది. వైర‌స్‌ మహమ్మారి రోజురోజుకూ విస్త‌రిస్తూ… విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని ప్రతీ వీధిని శానిటేషన్ చేస్తోంది. రసాయనాలతో పాటు బ్లీచింగ్‌ను కూడా చల్లుతున్నారు. అటు ఎమ్మెల్యేలు కూడా ప్రజా ప్రతినిధులలాగానే ప్రజలను కరోనా కట్టడి ఆవశ్యకత విషయంలో అప్రమత్తం చేస్తూనే ఉంటున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా శానిటేషన్ వర్కర్‌గా మారారు. రెడ్ జోన్‌గా ప్రకటించిన వడమాల గ్రామంలో ఆమె స్వయంగా […]

కరోనా వేళ.. శానిటేషన్ వర్కర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా..
Follow us on

ఏపీలో కరోనా కోర‌లు చాస్తోంది. వైర‌స్‌ మహమ్మారి రోజురోజుకూ విస్త‌రిస్తూ… విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని ప్రతీ వీధిని శానిటేషన్ చేస్తోంది. రసాయనాలతో పాటు బ్లీచింగ్‌ను కూడా చల్లుతున్నారు. అటు ఎమ్మెల్యేలు కూడా ప్రజా ప్రతినిధులలాగానే ప్రజలను కరోనా కట్టడి ఆవశ్యకత విషయంలో అప్రమత్తం చేస్తూనే ఉంటున్నారు.

ఈ నేపధ్యంలోనే తాజాగా నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా శానిటేషన్ వర్కర్‌గా మారారు. రెడ్ జోన్‌గా ప్రకటించిన వడమాల గ్రామంలో ఆమె స్వయంగా సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేశారు. అలాగే ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించి.. వడమాలలో కరోనా వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో ఇంటింటా సర్వే నిర్వహించాలని చెప్పారు. మరోవైపు నగరి నియోజకవర్గంలో కూడా పలు సేవా కార్యక్రమాల్లో రోజా పాలుపంచుకున్నారు. రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు ప్రతీ రోజూ భోజనం ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా నగరి మున్సిపల్ పరిధిలోని సత్రవాడలో 500 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేశారు.

ఇది చదవండి: లాక్ డౌన్ అమలులో విజయవంతం.. ఏపీ అగ్రస్థానం.!