False News: అక్కడ కరోనా ట్రీట్‌మెంట్‌కు, మతానికి లింక్.. ఈ వార్తలో నిజమెంత.?

కరోనా వైరప్‌పై సోషల్ మీడియాలో ఎన్నో పుకార్లు వస్తున్నాయి. ఏవి నిజమో, ఏవి అబద్దమో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెట్టింట్లో వచ్చే వదంతులను నమ్మొద్దని ప్రజలను హెచ్చరించాయి. ఈ తరుణంలో తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో కరోనా వైరస్ సోకిన వారిని, అనుమతులను వారి మత విశ్వాసాల బట్టి వార్డులుగా విభజించి ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారని పలు వెబ్‌సైట్లలో ఈ వార్త హల్‌చల్‌ చేసింది. ఇక దీనిపై స్పందించిన గుజరాత్ ఆరోగ్య […]

False News: అక్కడ కరోనా ట్రీట్‌మెంట్‌కు, మతానికి లింక్.. ఈ వార్తలో నిజమెంత.?

Updated on: Apr 15, 2020 | 4:55 PM

కరోనా వైరప్‌పై సోషల్ మీడియాలో ఎన్నో పుకార్లు వస్తున్నాయి. ఏవి నిజమో, ఏవి అబద్దమో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెట్టింట్లో వచ్చే వదంతులను నమ్మొద్దని ప్రజలను హెచ్చరించాయి. ఈ తరుణంలో తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో కరోనా వైరస్ సోకిన వారిని, అనుమతులను వారి మత విశ్వాసాల బట్టి వార్డులుగా విభజించి ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారని పలు వెబ్‌సైట్లలో ఈ వార్త హల్‌చల్‌ చేసింది. ఇక దీనిపై స్పందించిన గుజరాత్ ఆరోగ్య శాఖ.. మత విశ్వాసాల బట్టి కరోనా పేషంట్లకు సివిల్ ఆసుపత్రిలో చికిత్స ఇవ్వట్లేదని స్పష్టం చేసింది. కరోనా రోగులకు లక్షణాలు, వ్యాధి తీవ్రతను ఆధారం చేసుకుని డాక్టర్ల సిఫార్సు మేరకు వైద్యం అందిస్తున్నారని వెల్లడించింది.

కాగా, అంతకముందు జాతీయ మీడియాలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ కోవిడ్ 19 రోగులకు, అనుమానితులకు మతాన్ని బట్టి వార్డులను కేటాయించిందంటూ ఓ వార్త ప్రచురితమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకే హిందూ, ముస్లిం రోగులను విభజించి వైద్యం అందిస్తున్నట్లు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గున్వంత్ హెచ్ రాథోడ్ తెలిపారు. ఇక ఇలాంటి నిర్ణయం గురించి తమకు తెలియదని గుజరాత్ డిప్యూటీ సీఎం, హెల్త్ మినిస్టర్ నితిన్ పటేల్ చెప్పినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. కోవిడ్ 19 ప్రోటోకాల్ ప్రకారం.. కరోనా అనుమానితులు, రోగులను ప్రత్యేక వార్డులో ఉంచుతారు. ఇక ఆసుపత్రి వర్గాల సమాచారం.. చికిత్స కోసం వచ్చిన 186 మందిలో 150 మందికి కరోనా పాజిటివ్ తేలినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా 150 మందిలో కనీసం 40 మంది ముస్లింలు ఉన్నారు. ఇక మతాన్ని బట్టి చికిత్స అందిస్తున్న విషయం తనకు తెలియదని అహ్మదాబాద్ కలెక్టర్ కెకె నిరాలా తెలిపారు.