AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆరోగ్య సేతు’ యాప్ సరికొత్త రికార్డు.. రెండు వారాల్లో 50 మిలియన్ డౌన్‌లోడ్స్‌…

కరోనా వైరస్ ప్రభావం నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆరోగ్య సేతు’ అనే యాప్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. కరోనా మన దరికి చేరకుండా ఉండేందుకు, ఆ వ్యాధి సోకినవారు దగ్గరకు వస్తే గుర్తించేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ యాప్ 11 బాషలలో అందుబాటులో ఉండగా.. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి.. అలాగే ఐఫోన్‌ ఉపయోగించేవారు యాప్ స్టోర్‌లలో నుంచి డౌన్లోడ్‌ చేసుకోవాలి. అత్యాధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ద్వారా పని […]

'ఆరోగ్య సేతు' యాప్ సరికొత్త రికార్డు.. రెండు వారాల్లో 50 మిలియన్ డౌన్‌లోడ్స్‌...
Ravi Kiran
|

Updated on: Apr 15, 2020 | 9:01 PM

Share

కరోనా వైరస్ ప్రభావం నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆరోగ్య సేతు’ అనే యాప్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. కరోనా మన దరికి చేరకుండా ఉండేందుకు, ఆ వ్యాధి సోకినవారు దగ్గరకు వస్తే గుర్తించేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ యాప్ 11 బాషలలో అందుబాటులో ఉండగా.. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి.. అలాగే ఐఫోన్‌ ఉపయోగించేవారు యాప్ స్టోర్‌లలో నుంచి డౌన్లోడ్‌ చేసుకోవాలి.

అత్యాధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ద్వారా పని చేసే ఈ ‘ఆరోగ్య సేతు’ అప్లికేషన్ నుంచి దేశంలో కరోనా కేసుల రిపోర్టు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అంతేకాక కరోనా వైరస్ ఉన్న వ్యక్తి దగ్గరకు మీరు వెళ్తే తక్షణమే మీ లొకేషన్ స్కాన్ చేసి.. మీ డేటాను ప్రభుత్వానికి చేరవేస్తుంది. ఇలా ప్రజలను మహమ్మారి వైరస్ నుంచి రక్షించేందుకు ఎంతగానో ఉపయోగపడే ఈ యాప్ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.

వరల్డ్‌లో మోస్ట్ పాపులారిటీని సొంతం చేసుకున్న ‘పోకీమాన్ గో’ గేమ్ డౌన్‌లోడ్స్‌ను ఈ యాప్‌ బీట్‌ చేసింది. గత 13 రోజుల్లోనే ఈ ‘ఆరోగ్య సేతు’ యాప్ 50 మిలియన్ల యూజర్లను సంపాదించుకుని కొత్త రికార్డును సృష్టించింది. కాగా, లాక్ డౌన్ మే 3 వరకు పొడిగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Follow Us
డేట్, టైమ్, లొకేషన్ ఫిక్స్.. పొలిటికల్ వార్‌కు వచ్చేదెవరు? తగ్గేద
డేట్, టైమ్, లొకేషన్ ఫిక్స్.. పొలిటికల్ వార్‌కు వచ్చేదెవరు? తగ్గేద
ఏడుస్తున్న పిల్లలను వాషింగ్ మెషీన్‌లో పెట్టి లాక్.. జెట్ స్ప్రేతో
ఏడుస్తున్న పిల్లలను వాషింగ్ మెషీన్‌లో పెట్టి లాక్.. జెట్ స్ప్రేతో
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష..
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష..
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు ప్రభుత్వం తెలిపిన 8 అభ్యంతరాలు ఇవే
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు ప్రభుత్వం తెలిపిన 8 అభ్యంతరాలు ఇవే
కోట్లాది డాలర్లు, వందల కేజీల బంగారం.. జనం సొమ్ము దోచేశారు!
కోట్లాది డాలర్లు, వందల కేజీల బంగారం.. జనం సొమ్ము దోచేశారు!
నోట్లో కరిగిపోయే కమ్మనైన పేదోళ్ల పచ్చి కొబ్బరి పాయసం..
నోట్లో కరిగిపోయే కమ్మనైన పేదోళ్ల పచ్చి కొబ్బరి పాయసం..
క్రికెట్ వేలంలో కోహ్లీ మేనల్లుడి జోరు
క్రికెట్ వేలంలో కోహ్లీ మేనల్లుడి జోరు
నా సినిమా చూసి మహేష్ అన్న అర్ధరాత్రి కాల్ చేశారు..
నా సినిమా చూసి మహేష్ అన్న అర్ధరాత్రి కాల్ చేశారు..
ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా..? కానీ, ఈ ఒక్క పనిచేస్తే బిందాస్
ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా..? కానీ, ఈ ఒక్క పనిచేస్తే బిందాస్
రోజుకు 2 నిమిషాలు ఒంటి కాలిపై నిలబడి బ్రష్ చేయండి..! లాభాలు ఇవే
రోజుకు 2 నిమిషాలు ఒంటి కాలిపై నిలబడి బ్రష్ చేయండి..! లాభాలు ఇవే