ఏపీలో ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు.. అదంతా ఫేకేనట.. అసలు నిజమిదే..

|

Apr 18, 2020 | 5:22 PM

కరోనా కాలంలో సోషల్ మీడియాలో లెక్కలేనన్ని తప్పుడు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలోని మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు వస్తుందంటూ ఓ వార్త వైరల్ అయింది. దీనిపై తాజాగా మీసేవ డైరెక్టర్ స్పందించారు. కొన్ని సామాజిక మాధ్యమాలు, వాట్సప్ గ్రూపులలో మీసేవ కేంద్రాల్లో అప్లై చేసుకుంటే ఐదు రోజుల్లో రేషన్ కార్డు వచ్చేస్తుందంటూ ప్రచారం జరుగుతోందని.. అదంతా వట్టి పుకార్లేనని మీ సేవ సంస్థ డైరెక్టర్ కొట్టిపారేశారు. […]

ఏపీలో ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు.. అదంతా ఫేకేనట.. అసలు నిజమిదే..
Follow us on

కరోనా కాలంలో సోషల్ మీడియాలో లెక్కలేనన్ని తప్పుడు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలోని మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు వస్తుందంటూ ఓ వార్త వైరల్ అయింది. దీనిపై తాజాగా మీసేవ డైరెక్టర్ స్పందించారు. కొన్ని సామాజిక మాధ్యమాలు, వాట్సప్ గ్రూపులలో మీసేవ కేంద్రాల్లో అప్లై చేసుకుంటే ఐదు రోజుల్లో రేషన్ కార్డు వచ్చేస్తుందంటూ ప్రచారం జరుగుతోందని.. అదంతా వట్టి పుకార్లేనని మీ సేవ సంస్థ డైరెక్టర్ కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను జారీ చేశారు. కొత్త రేషన్ కార్డులు కావాలంటే కేవలం గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చెప్పినట్టు స్పందన కార్యక్రమం ద్వారా కూడా కొత్త రేషన్ కార్డులను పొందవచ్చని ఆయన తెలిపారు.

Also Read:

‘రంజాన్’ వరకు లాక్‌డౌన్ పొడిగించాలి.. ముస్లిం కార్యకర్త వినతి..

శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలకు షాక్.. గుర్తింపు రద్దు చేసిన ఇంటర్ బోర్డు..

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

మూడు నెలలు అద్దె అడగకండి… సర్కార్ కీలక నిర్ణయం..