‘రంజాన్’ వరకు లాక్‌డౌన్ పొడిగించాలి.. ముస్లిం కార్యకర్త వినతి..

కరోనా వైరస్ నేపధ్యంలో దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ను రంజాన్ మాసం ముగిసేవరకు పొడిగించాలని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఛాన్సలర్, ముస్లిం యాక్టివిస్ట్ ఫిరోజ్ బఖ్త్ అహ్మద్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఈ మహమ్మారిని కట్టడి చేసే క్రమంలోనే మే 24 వరకు లాక్ డౌన్ విధించాలని అహ్మద్ కోరారు. వివిధ రాష్ట్రాల్లో డాక్టర్లు, పోలీసులు,హెల్త్ కేర్ వర్కర్లపై కొంతమంది ముస్లింలు ప్రవర్తించిన తీరుకు ఆయన క్షమాపణలు చెప్పారు. ‘రంజాన్ వేళ ముస్లింలు జాగ్రత్తలను […]

'రంజాన్' వరకు లాక్‌డౌన్ పొడిగించాలి.. ముస్లిం కార్యకర్త వినతి..
Follow us

|

Updated on: Apr 17, 2020 | 7:56 PM

కరోనా వైరస్ నేపధ్యంలో దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ను రంజాన్ మాసం ముగిసేవరకు పొడిగించాలని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఛాన్సలర్, ముస్లిం యాక్టివిస్ట్ ఫిరోజ్ బఖ్త్ అహ్మద్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఈ మహమ్మారిని కట్టడి చేసే క్రమంలోనే మే 24 వరకు లాక్ డౌన్ విధించాలని అహ్మద్ కోరారు. వివిధ రాష్ట్రాల్లో డాక్టర్లు, పోలీసులు,హెల్త్ కేర్ వర్కర్లపై కొంతమంది ముస్లింలు ప్రవర్తించిన తీరుకు ఆయన క్షమాపణలు చెప్పారు.

‘రంజాన్ వేళ ముస్లింలు జాగ్రత్తలను పాటించకుండా.. కరోనా వైరస్ ముప్పు ఉన్నప్పటికీ భారీగా ఇఫ్తార్ విందులు ఏర్పాట్లు చేస్తారు. ఈ నేపధ్యంలోనే రంజాన్ చివరి వరకు అనగా మే 24 వరకు లాక్ డౌన్ ఎత్తివేయకుండా అమలు చేయాలి. అయితే ఒకవేళ మే 3న లాక్ డౌన్ ఎత్తివేస్తే.. అత్యుత్సాహంతో ముస్లింలు రద్దీ మార్కెట్లు, భారీ ఇఫ్తార్ విందులు, ఎక్కువమందితో ప్రార్ధనలు నిర్వహిస్తారు. దీనితో కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని’ అహ్మద్ లేఖలో పేర్కొన్నాడు.

“చట్టాన్ని గౌరవించే భారతీయ ముస్లింగా, భారతదేశంలో నిర్బంధంలో ఉన్న నా సమాజానికి చెందిన వారందరి తరపున క్షమాపణలు కోరుతున్నాను. కొంతమంది ముస్లింలు ఉమ్మివేయడం, ఆసుపత్రి సిబ్బందితో (ముఖ్యంగా నర్సులు) అసభ్యంగా ప్రవర్తించడం,మూత్రం బాటిల్స్ విసిరేయడం, కరోనావైరస్ చికిత్సకు సహకరించకపోవడం వంటి సంఘటనలు చూసినప్పుడల్లా నేను చాలా సిగ్గుపడుతున్నానని చెబుతూ అహ్మద్ లెటర్‌ను ముగించాడు.

Also Read:

చేతులెత్తేసిన ఇమ్రాన్ ఖాన్.. ‘మమ్మల్ని ఆదుకోండి’ అంటూ భారత్‌ను వేడుకోలు..

ప్రాణాలు వదిలేస్తాం కానీ.. మసీదును విడిచిపెట్టం..

కరోనా తెచ్చిన తంటా.. అమెరికన్లలో పట్టుకున్న కొత్త భయం..

‘కరోనా వైరస్’ను మొదటగా కనుగొన్నది ఓ మహిళ.. ఆమె గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

కరోనా ‘బయో వార్’ నిజమేనా..? మృతుల సంఖ్యను పెంచేసిన చైనా.