సీఎం సంచలనం.. డాక్టర్లు, నర్సులకు డబుల్ శాలరీ..

Coronavirus Outbreak: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు వైద్య సిబ్బంది రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెడుతూ డాక్టర్లు, నర్సులు కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. అలాంటి వారికి హర్యానా ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బందికి డబుల్ శాలరీలు ఇస్తామని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కీలక ప్రకటన చేశారు. ఈ […]

సీఎం సంచలనం.. డాక్టర్లు, నర్సులకు డబుల్ శాలరీ..

Updated on: Apr 10, 2020 | 2:39 PM

Coronavirus Outbreak: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు వైద్య సిబ్బంది రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెడుతూ డాక్టర్లు, నర్సులు కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. అలాంటి వారికి హర్యానా ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బందికి డబుల్ శాలరీలు ఇస్తామని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కీలక ప్రకటన చేశారు. ఈ మహమ్మారి తగ్గేంత వరకు వీళ్లకు నెలకు ఇచ్చే జీతం డబుల్ ఇస్తామన్నారు.

అంతేకాకుండా కరోనా వైరస్ విధులు నిర్వర్తిస్తూ ఎవరైనా పోలీసు చనిపోతే వారి కుటుంబాలకు రూ. 30 లక్షల పరిహారాన్ని ఇస్తామని సీఎం ప్రకటించారు. ఇక గతంలో పంజాబ్ ప్రభుత్వం కూడా కరోనా వారియర్స్‌కు రూ.50 లక్షలతో ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అటు కేంద్రం ప్రకటించిన రూ.లక్షా 70వేల కోట్ల ప్యాకేజీలో కూడా కరోనా నియంత్రణలో శ్రమిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ (డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది)కి రూ.50 లక్షల ఇన్సూరెన్స్ ప్రకటించింది.

ఇవి చదవండి:

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఓలా సర్వీసులకు గ్రీన్ సిగ్నల్..

ఏపీలో కరోనా రోగులకు పౌష్టికాహారం.. ఆరోగ్య ఆంధ్రా ట్వీట్ వైరల్..

దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులు.. మొదటి స్థానం, చివరి స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఇవే..

జూలైలో ఐపీఎల్.. కొత్త తేదీలు ఫిక్స్.?

కేంద్రం ప్రకటన.. ఏప్రిల్ 14 జాతీయ సెలవు దినం..

తీరు మారని పాకిస్థాన్.. కరోనా భయంతో డాక్టర్లపై లాఠీచార్జ్..

ఏపీ తాజా హెల్త్ బులిటెన్.. తగ్గుతోన్న కరోనా కేసులు..

కేంద్రం కీలక నిర్ణయం.. పెరగనున్న అబార్షన్ల సంఖ్య.!

ఏప్రిల్ 15 నుంచి రైల్ జర్నీ.. కండీషన్స్ అప్లై..!