కరోనా లాక్ డౌన్.. మూడు నెలలు కరెంట్ బిల్లు కట్టక్కర్లేదా..?

|

Mar 31, 2020 | 10:50 PM

Coronavirus Outbreak: ప్రపంచదేశాలను అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్ ఇండియాలో కూడా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశంలో 1356 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో 138 కోలుకున్నారు. అటు 1173 మంది చికిత్స పొందుతుండగా.. 45 మంది ఈ వైరస్ బారిన పడి మృతి చెందారు. ఇక దేశంలో కరోనా కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చాలామంది పనులు లేక ఇళ్లకే పరిమితమయ్యారు. అలాగే వలస […]

కరోనా లాక్ డౌన్.. మూడు నెలలు కరెంట్ బిల్లు కట్టక్కర్లేదా..?
Follow us on

Coronavirus Outbreak: ప్రపంచదేశాలను అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్ ఇండియాలో కూడా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశంలో 1356 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో 138 కోలుకున్నారు. అటు 1173 మంది చికిత్స పొందుతుండగా.. 45 మంది ఈ వైరస్ బారిన పడి మృతి చెందారు. ఇక దేశంలో కరోనా కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చాలామంది పనులు లేక ఇళ్లకే పరిమితమయ్యారు. అలాగే వలస కూలీలు కూడా రోడ్డున పడ్డారు. ఇక వారందరినీ ఒక చోటకు చేర్చి కావాల్సిన ఏర్పాట్లలన్నీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి.

మరోవైపు పనులు లేక ఇబ్బందుల పడుతున్న పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా మూడు నెలల రేషన్ అందజేస్తోంది. అంతేకాకుండా ప్రతీ కుటుంబానికి కొంత డబ్బులు అందజేసేలా చర్యలు తీసుకుంటోంది. అటు బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల నుంచి తీసుకున్న అన్ని రకాల లోన్లపై ఇప్పటికే ఆర్బీఐ మూడు నెలల మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా కరోనా ప్రభావం నేపధ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

కరెంట్ బిల్లుల చెల్లింపుల విషయంపై అన్ని రాష్ట్రాలకు నోటిసులు జారీ చేసింది. కరెంట్ బిల్లులపై మూడు నెలల మారటోరియం విధించాలని కోరింది. అలాగే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కు కూడా ఆదేశాలు పంపింది. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని అందుకే మూడు నెలల పాటు కరెంట్ బిల్లులపై మారటోరియం విధించాలని మోదీ సర్కార్ పవర్ జనరేషన్ కంపెనీలను కోరింది.

ఇవి చదవండి:

మద్యం ప్రియులకు శుభవార్త.. మూడు నెలలు బీర్లు ఫ్రీ.. ఫ్రీ..

EMIలపై కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన పలు బ్యాంకులు..

తెలంగాణ లాక్ డౌన్.. ఏప్రిల్ 14 వరకు మద్యం దుకాణాలు బంద్..