గుడ్ న్యూస్.. కరోనా నుంచి కోలుకున్న విశాఖ వాసి..

|

Mar 31, 2020 | 10:49 PM

Coronavirus Outbreak: భారత్‌లో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 1251 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వేల సంఖ్యలో అనుమానితులున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కలకలం రేపుతోంది. అటు ఏపీలో40 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా.. ఇటు తెలంగాణలో వారి సంఖ్య 77కు చేరింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఏపీలోని విశాఖలో నమోదైన తొలి కరోనా బాధితుడు డిశ్చార్జ్ అయ్యాడు. విశాఖపట్నంకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు ఇటీవల […]

గుడ్ న్యూస్.. కరోనా నుంచి కోలుకున్న విశాఖ వాసి..
Follow us on

Coronavirus Outbreak: భారత్‌లో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 1251 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వేల సంఖ్యలో అనుమానితులున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కలకలం రేపుతోంది. అటు ఏపీలో40 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా.. ఇటు తెలంగాణలో వారి సంఖ్య 77కు చేరింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఏపీలోని విశాఖలో నమోదైన తొలి కరోనా బాధితుడు డిశ్చార్జ్ అయ్యాడు.

విశాఖపట్నంకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు ఇటీవల మక్కాకు వెళ్లి వచ్చి కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. ఇక విశాఖలో నమోదైన తొలి పాజిటివ్ కేసు ఇతడిదే. ఈ నేపథ్యంలో దాదాపు 13 రోజుల పాటు అతడిని అధికారులు ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందించగా.. తాజాగా అతడు పూర్తిగా కోలుకున్నాడు. ఇటీవల రెండు సార్లు కరోనా టెస్ట్ చేయగా.. అందులో నెగటివ్ రావడంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. కాగా, విశాఖలో తొలి సక్సెస్ తో వైద్యాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అటు మరో ఐదుగురు కరోనా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అటు హోమ్ ఐసోలేషన్ లో 30,693 మంది ఉండగా.. ఆసుపత్రిలోని క్వారంటైన్ లో 262 మంది ఉన్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇవి చదవండి:

మద్యం ప్రియులకు శుభవార్త.. మూడు నెలలు బీర్లు ఫ్రీ.. ఫ్రీ..

EMIలపై కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన పలు బ్యాంకులు..

తెలంగాణ లాక్ డౌన్.. ఏప్రిల్ 14 వరకు మద్యం దుకాణాలు బంద్..